అమరావతి (చైతన్యరథం): ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. దీనిపై వైసీపీ నేతలు, నీలి మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేలా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.