చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్‌ చర్యలు

by చైతన్యరధం
Dec 26, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు
  • పాఠశాల విద్యలో సంస్కరణలు
  • విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి 16,437 టీచర్‌ పోస్టుల భర్తీకి చర్యలు
  • మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
  • జనవరి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
  • విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్‌ చర్యలు

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రామోడల్‌ ఎడ్యుకేషన్‌గా ముద్ర వేయాలని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డీఎస్సీలో ఎక్కువమంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను పారదర్శకంగా నిర్వహించారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించిన టెట్‌లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటులాంటి 117 జీవోను రద్దుచేసి, కొత్త డ్రాఫ్ట్‌ మోడల్‌ను సిద్ధం చేశారు. కొత్తపోస్టుల భర్తీ పూర్తయ్యే లోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీ చేశారు.

ప్రభుత్వస్కూళ్లను రాజకీయాలకు అతీతంగా సిఎంతో సహా ఎటువంటి రాజకీయనేతల ఫోటోలు లేకుండా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రాజకీయాలకు సంబంధం లేని స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమేగాక దేశంలోనే తొలిసారిగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రానున్న అయిదేళ్లలో ఆంధ్రామోడల్‌ విద్యావ్యవస్థను తయారుచేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్‌ చేపట్టిన ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

పాఠ్యాంశాల్లో మార్పులకు చర్యలు
మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ -2020, నిపుణ్‌ భారత్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో మార్పులకు కసరత్తు ప్రారంభించారు. విద్యా సంస్కరణల్లో యునిసెఫ్‌ తోపాటు ప్రథమ్‌, జె-పాల్‌, మది, లీడర్‌ షిప్‌ ఈక్విటీ (ఎల్‌ఎఫ్‌ఇ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉత్తమ బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టారు. బడి బయట ఉన్న 84,640 మంది విద్యార్థులకు నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, సీజనల్‌ హాస్టల్స్‌ ద్వారా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి తెచ్చారు. ప్రతి బిడ్డను సమర్థవంతంగా ట్రాక్‌ చేయడానికి ఫ్యామిలీ వెల్ఫేర్‌, పాఠశాల విద్యా విభాగాల నుండి డేటాబేస్‌లను క్రోడీకరించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో డిజిటల్‌ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చకున్నారు. కేజీబీవీల్లో 342 మంది బోధన, 991 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. కెరీర్‌ ప్లానింగ్‌, మానసిక ఎదుగుదల, సంఘర్షణల పరిష్కారంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 255 మంది కెరీర్‌, మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించారు. విద్యార్థుల్లో డిజిటల్‌ సౌలభ్యాన్ని పెంపొందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమగ్ర క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించారు. ఏపీ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్రం గుర్తించింది. వికలాంగుల హక్కుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సర్వశిక్ష అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ బి శ్రీనివాసరావు ఇటీవల ఢల్లీిలో జాతీయ అవార్డును అందుకున్నారు.

అకడమిక్‌, మౌలిక సదుపాయాలకు స్టార్‌ రేటింగ్‌
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 వేల పైచిలుకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రతిభ ఆధారంగా అకడమిక్‌ స్టార్‌ రేటింగ్‌, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయ్‌ లెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్‌ మెరుగుదలకు రూట్‌ మ్యాప్‌ నిర్దేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీచ్‌ టూల్‌ ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను అంచనావేసి బోధనా పద్ధతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, కమ్యూనికేషన్‌, సమస్యల పరిష్కారంతో సహా కీలక నాయకత్వ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని అభిరుచులకు తగ్గట్లుగా మెనూ మార్పు చేశారు. జనవరి నుంచి కేజీబీవీ స్కూళ్లలో డైట్‌ ఛార్జీలనురూ. 1,400 నుండి రూ.1,600కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మెగా పేరెంట్‌, టీచర్‌ సమావేశాల సందర్భంగా, విద్యార్థుల పనితీరుతో పాటు పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో వారు సాధించిన విజయాలను పొందుపరుస్తూ హోలిస్టిక్‌ రిపోర్ట్‌ కార్డ్‌లు తల్లిదండ్రులకు అందజేశారు.హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా స్క్రీనింగ్‌ చేసిన విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌లను వివరించే హెల్త్‌ కార్డ్‌లను కూడా అందజేశారు.

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత ఆరునెలల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్ళు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్‌లను కవర్‌ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, స్కూల్‌ బ్యాగ్‌లు ఉచితంగా అందజేశారు. ఆర్జేడీల పర్యవేక్షణలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో అకడమిక్‌ గైడెన్స్‌, మానిటరింగ్‌ సెల్‌లు ఏర్పాటు చేశారు. 11, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్‌ పరీక్షల కోసం కేంద్రీకృత ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే రెండు ప్రీ-ఫైనల్‌ పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థుల ప్రాక్టీస్‌ కోసం విద్యార్థులందరికీ క్వశ్చన్‌ బ్యాంకులను అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు ప్రతి 10, 15 మంది విద్యార్థులను టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌తో అనుసంధానం చేస్తూ అన్ని జూనియర్‌ కళాశాలల్లో మెంటార్‌ షిప్‌ ప్రోగ్రామ్‌ అమలు చేస్తున్నారు. ఇంటర్‌ చదివే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు.

వచ్చే ఆరునెలలకు రూట్‌ మ్యాప్‌!
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రానున్న ఆరునెలల్లో చేపట్టాల్సిన చర్యలపై రూట్‌మ్యాప్‌ రూపొందించారు. స్కూళ్లవారీగా ఆయా పాఠశాలల వాస్తవిక స్థితిని తెలుసుకునేందుకు ‘‘ఒక పాఠశాల-ఒక యాప్‌’’ పేరుతో సమగ్ర డాష్‌బోర్డ్‌ సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎక్సోపో, జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నేతృత్వంలో స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం చివరి పని రోజున మరోమారు మెగా పీటీఎం నిర్వహించి విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద 1 నుండి 12 తరగతులకు కొత్త యూనిఫారాలు, బ్యాగ్‌లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్‌ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌, మాన్యువల్‌, నోట్‌బుక్‌లు, రికార్డులను అందజేయాలని నిర్ణయించారు. స్టార్‌ రేటింగ్‌ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 12 తరగతుల పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. ఐఐటీ మద్రాస్‌తో కలిసి విద్యా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్‌లైన్‌ నాయకత్వ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు.

అకడమిక్‌ క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుదల, ఫిజికల్‌, వర్చువల్‌ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్‌ కిట్లు అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ళలో కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ సర్టిఫికేషన్‌తో పాటు నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ సహకారంతో 11,12వ తరగతుల వృత్తి విద్యార్థులకు డ్యుయల్‌ ధృవీకరణ పత్రాలను అందజేసేలా కసరత్తు చేస్తున్నారు. అన్ని ముఖ్యమైన అకడమిక్‌ అప్‌డేట్‌లు, సమాచారాన్ని అందజేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూరుశాతం అపార్‌ ఐడీ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్‌ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.

Previous Post

కుహనా మేధావులారా నిజాలు తెలుసుకుని మాట్లాడండి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 24-12-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist