- ప్రజాస్వామ్యం గురించి జగన్రెడ్డి నీతులు చెబుతున్నారు
- పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు
- నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి
- ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ విధంగా నిర్వహిస్తారు?
- ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు
- ప్రజాస్వామ్య వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది
- బెంగళూరులో మీడియా సమావేశంలో మంత్రి లోకేష్
బెంగళూరు(చైతన్యరథం): ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శ కంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన అనంతరం స్థానిక ఎన్నికలపై మంత్రి స్పందించారు. పులివెందులలో ఏకగ్రీవం జరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోని ప్రతి వార్డు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పులివెందులలో ఏ విధంగా ఏకగ్రీవం చేశారని అందరూ ప్రశ్నించాలి. ఇవాళ ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలను నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీస్ సెక్యూరిటీని కల్పించడం జరిగింది. పులివెందులలో నామినేషన్ వేసేందుకు ఎవరూ అడ్డుపడలేదు. నామినేషన్ వేశారు.
పులివెందులలో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. గత రాత్రి వాహనాలను తగులబెట్టారు. నిందను మాపై వేశారు. ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతు న్నా యి. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఎన్నికలు జరుగు తున్నాయి. పులివెందులలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇందుకు జగన్రెడ్డి వైఖరే కారణమని పేర్కొన్నారు. పులి వెందులలో జగన్రెడ్డి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఇప్పుడు తామే బాధితులం అని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. జగన్రెడ్డి మాత్రం బెంగళూరులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం అక్కడి నుంచి వచ్చి సమస్య లు సృష్టించారు.
అనంతరం హెలికాఫ్టర్లో తిరిగి వెళ్లిపోయా రు. జాతీయ మీడియాను పిలిచి శాంతిభద్రతల సమస్య అంటూ నిందలు వేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో పులివెం దుల ఎందుకు ఏకగ్రీవం అయిందో ప్రజలకు జగన్రెడ్డి సమా ధానం చెప్పాలి. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేశా రు. ఇప్పుడు మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం. పులివెందులలో కూడా ప్రజలు వచ్చి ఓట్లు వేశారు. జగన్రెడ్డి వచ్చి సమస్యలు సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ విధంగా నిర్వహిస్తారు? విశాఖతో సహా కడప పట్టణంలో ఎన్నిక లు జరిగాయి. ఒక్క సమస్య కూడా ఉత్పన్నం కాలేదు. సమస్యల కు జగన్రెడ్డి ఒక్కడే కారణమని చెప్పారు.
















