- యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం
- ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష
- నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం, వర్షాలు, గాలుల తీవ్రత, జలాశయాల నిర్వహణ అంశాలతో పాటు వివిధ శాఖలు చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై సమీక్షించారు. తుఫాన్ సహాయక చర్యలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను ముప్పు నెలకొనడంతో సోమవారం నాటి తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయు గుండంగా, అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబరు 3వ తేదీ ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటొచ్చని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకా శం ఉందని వెల్లడించారు. తుఫాన్ కారణంగా నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు… అలాగే నవంబరు 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లా లో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒకటి ఉన్నాయన్నారు. నవంబరు 3న జిల్లాల వారీగా అంచనా వేసిన సగటు వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏలూరు జిల్లాలో సుమా రు 179 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 163 మి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 161 మి.మీ., పశ్చిమ గోదావరి జిల్లాలో 147 మి.మీ., గుంటూరు జిల్లాలో 119 మి.మీ., బాపట్ల జిల్లాలో 104 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
బుడమేరు సహా పలు చోట్ల వరద ముప్పు
భారీవర్షాల నేపథ్యంలో బుడమేరు దగ్గర నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో కూడా భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాన్ ప్రభావంతో బలమై న గాలులు వీచడం వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసర మైన మానవ వనరులు, పరికరాలను ముందుగానే సిద్ధం చేసుకో వాలని సీఎం సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలిం చి అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో ఎన్ని గంటల్లో పునరుద్ధరణ చేపట్టగలుగుతాం, ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా అందించగలుగుతామనే విషయంపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని సూచించారు. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలియజేసే పరిస్థితి ఉండాలని తెలిపారు.
ప్రతి 4 గంటలకు తుఫాను పరిస్థితిపై బులెటిన్
తుఫాను ప్రభావంపై ప్రతి నాలుగు గంటలకు ఒకసారి బులెటి న్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెలికాం నెట్వర్క్ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకుని మొబైల్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తుఫాను ప్రభా వం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సంస్థలను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నా రు. అర్నబ్ తుఫాను సమయంలో నెట్వర్క్ సంస్థలు మరింత ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో అర్నబ్ తుఫాను వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఈ రోజు రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
















