- పాల్గొన్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- తెలంగాణ మంత్రి పొన్నంతో కలిసి రోడ్ల పరిశీలన
న్యూఢల్లీి(చైతన్యరథం): ఏపీ రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి మంగళవారం ఢల్లీి పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్ష తన జరుగుతున్న 42వ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఢల్లీిలో కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధి విధానాలు, రవాణా వ్యవస్థపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రోడ్డు రవాణా భద్రతపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కేంద్రం అనుసరిస్తున్న సాంకేతికతను అడిగి తెలుసు కున్నారు. అనంతరం రోడ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.