చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌..సదా ఆపన్నుల సేవలోనే

ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్ఘాటన

by చైతన్యరధం
Mar 7, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌..సదా ఆపన్నుల సేవలోనే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అభాగ్యులను ఆదుకునేందుకు ట్రస్ట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
  • సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
  • తలసేమియా బాధితులకు అండగా నిలబడతాం
  • ట్రస్ట్‌ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది
  • ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్ఘాటన
  • విజయవాడలో ట్రస్ట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

విజయవాడ (చైతన్యరథం): ఆపన్నులను ఆదుకునేందుకు తమ ట్రస్ట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడ టీచర్స్‌ కాలనీలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నూతన భవన నిర్మాణానికి నారా భువనేశ్వరి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…ఇప్పటివరకూ హైదరాబాద్‌ నుంచి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా విజయవాడలో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ట్రస్ట్‌ ద్వారా ఆపన్నులకు సేవలు
28 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను స్థాపించినప్పుడు చంద్రబాబు మాకు ఒకటే మాట చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని సూచించారు. ఏ నమ్మకంతోనైతే ఆయన ఈ బాధ్యతలు అప్పగించారో వాటిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నాం. మాటల్లో చెప్పింది చేసి చూపిస్తున్నాం. ట్రస్ట్‌ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానంటే అందుకు మా టీం సభ్యులే కారణం. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. అలాగే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా మేము పేదలకు సేవ చేస్తున్నామంటే అందుకు దాతల సహకారం మరువలేనిది. విరాళం ఎంతన్నది ముఖ్యం కాదు. పేదలకు అండగా నిలబడాలన్న ఆశయం ఎంతో గొప్పది. 2026 ఫిబ్రవరి నాటికి విజయవాడలో ట్రస్ట్‌ భవనం నిర్మాణం పూర్తి చేసి సేవలు ప్రారంభిస్తాము. ఈ ట్రస్ట్‌ భవనంలో ఆఫీస్‌, బ్లడ్‌ బ్యాంక్‌, తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇటీవల విజయవాడలో తలసేమియా బాధితుల సహాయార్థం నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్‌ నైట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన మాలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉత్సాహాన్ని కలిగించిందని భువనేశ్వరి తెలిపారు.
ప్రజాసేవే పరమావధిగా..
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే పేదల ముఖాల్లో చిరునవ్వు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో, చంద్రబాబు ఆలోచనలు, సహకారంతో ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరలో హైదరాబాద్‌, వైజాగ్‌, తిరుపతి, రాజమండ్రిలో కూడా తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. అవి 24 గంటలూ పనిచేస్తాయి. ట్రస్ట్‌ ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ 7,531 మందికి శిక్షణ అందించాం. 2,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అలాగే కుప్పంలో 150 మంది మహిళలకు టైలరింగ్‌, జ్యూట్‌ బ్యాగ్‌ తయారీ, సిల్క్‌ దారంతో గాజుల తయారీ, చికన్‌కారీ ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చాము. మహిళలు ఆర్థికంగా పైకి రావాలి, వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని చంద్రబాబు ఎపుడూ చెబుతుంటారు. డ్వాక్రా ఏర్పాటుతో అది ఆచరణలో చేసి చూపించారు కూడానని భువనేశ్వరి అన్నారు.
ట్రస్ట్‌ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన
ట్రస్ట్‌ ద్వారా సంజీవని ఆరోగ్య క్లినిక్‌లు నడుపుతున్నాము. ఈ క్లినిక్స్‌ వల్ల లక్షా 60 వేల 290 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాం. ఇందుకోసం రూ.4 కోట్ల 2 లక్షల 50 వేలు ఖర్చు చేశాం. ట్రస్ట్‌ ద్వారా 14 వేల 56 హెల్త్‌ క్యాంప్స్‌ కూడా నిర్వహించాం. వీటి ద్వారా 20 లక్షలమందికి ప్రయోజనం కలిగింది. ఇందుకోసం రూ. 22.43 కోట్లు ఖర్చయింది. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గండిపేటలో స్కూల్‌, మహిళల డిగ్రీ కాలేజ్‌ నిర్వహిస్తున్నాం. అందులో వచ్చిన లాభాలతో కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్కూలు నిర్వహిస్తున్నాం. పేద, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆ స్కూల్లో ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇందులో 2 వేల 20 మంది చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువు చెబుతున్నాం. చల్లపల్లి స్కూల్లో పిల్లల క్రమశిక్షణ చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. పేదలు, తల్లిదండ్రులు లేని వారికి జీవితం విలువ బాగా తెలుస్తుంది. అందుకే వారంతా పట్టుదలతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని భువనేశ్వరి తెలిపారు.
విపత్తుల్లో ఆపన్నహస్తం
విపత్తుల సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆపన్నులకు సేవలు అందించాం. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం. కేరళలో వరదలు, హుద్‌ హుద్‌, తిత్లీ తుపాన్లు, కర్నూలు వరదలు, విజయవాడ వరదల సమయంలో బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అండగా నిలిచింది. ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చేశాం. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరపున న్యూట్రిఫుల్‌ యాప్‌ను నిర్వహిస్తున్నాము. ఇందులో 16 మంది న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. బీపీ, షుగర్‌, అధిక బరువు వంటి సమస్యలపై వీరు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తారు. ట్రస్ట్‌ ద్వారా స్త్రీ శక్తి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా 7 వేలమందికి పైగా ఆర్థిక ప్రయోజనం పొందారు. ఇందుకోసం రూ. 20 లక్షలు ఖర్చు చేశాం. అలాగే అన్ని దానాల్లో రక్తదానం గొప్పదంటారు. ట్రస్ట్‌ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. అర్ధరాత్రి తలుపుతట్టినా రక్తం ఇచ్చేందుకు ముందుకొస్తున్న రక్తదాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. యుఫోరియా మ్యూజికల్‌ నైట్‌ వంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని భువనేశ్వరి చెప్పారు.
విరాళాలు అందించిన పలువురు దాతలు
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా పలువురు దాతలు విరాళాలు అందించారు. ట్రస్ట్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వాములు అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ట్రస్ట్‌ ద్వారా సేవలు ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నారా భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు బెంజిసర్కిల్‌ లోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

Previous Post

వర్శిటీలను బలోపేతం చేస్తాం

Next Post

అమరావతి నిర్మాణంలో..ప్రజల సొమ్ము పైసా కూడా ఖర్చు చేయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

కార్యకర్త
@ April 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
విశాఖ.. ఇక సాంకేతిక పతాక!
ఆంధ్రప్రదేశ్

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక
ఆంధ్రప్రదేశ్

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు

చైతన్యరధం
@ April 28, 2026
వెల్కమ్ గూగుల్!
ఆంధ్రప్రదేశ్

వెల్కమ్ గూగుల్!

చైతన్యరధం
@ April 28, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist