చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం

విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Apr 4, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దశాబ్దాల సమస్యను 10 నెలల్లో పరిష్కరించా
  • అహర్నిశలు కష్టపడి మంగళగిరి ప్రజల మనసుగెలిచా
  • నా మెజారిటీ కంటే ప్రత్యర్థులకు వచ్చిన ఓట్లు తక్కువ, వారి మాటలను పట్టించుకోను
  • కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పార్కుకు ప్రణాళికలు
  • త్వరలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
  • విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్రంలో జేసీబీ పాలనపోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్‌ గురువారం ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…గతంలో మంగళగిరిలో జేసీబీ పాలన చూశాం, ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించాం, ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లిలో తొలిపట్టాను అందజేశానని తెలిపారు. మంగళగిరిలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కీలకమైన హామీ నెరవేర్చా. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్‌ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. వారి కష్టాలు చూశాకే అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పాను, ఆ హామీని నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉంది. తొలివిడతగా 3వేల మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

ఘనవిజయంతో నా బాధ్యత పెరిగింది
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి పోటీచేసి 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. మొదటి రోజు బాధపడ్డా, రెండో రోజునుంచి మంగళగిరి ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించా. గత అయిదేళ్లుగా సొంత నిధులతో నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి ట్యాంకర్లు, సొంత డబ్బుతో ఉచితంగా గ్రావెల్‌ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్‌, టెలీ మెడిసిన్‌ సేవలు, వైద్యసేవల కోసం ఎన్టీఆర్‌ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్‌ కిట్స్‌ ఇచ్చాం. మంగళగిరిలో ప్లేగ్రౌండ్స్‌ ఏర్పాటుచేశాం. ఎన్నికల ప్రచారంలో 50వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా. నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని చెప్పా. మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3వ అతి పెద్ద మెజారిటీ 91 వేలతో నన్ను గెలిపించారు. ఈ ఘన విజయంతో నాలో కసి, బాధ్యత పెరిగిందని మంత్రి లోకేష్‌ అన్నారు.
మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్కులు, ప్లేగ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, పైప్‌ లైన్‌ ద్వారా గ్యాస్‌ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో మోడరన్‌ రైతుబజార్‌ నిర్మాణం, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కల అయిన వంద పడకల హాస్పటల్‌ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. స్థానిక సంస్థల నిధులు, సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

నడకలేదు, పరుగులే!

మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మారుస్తా
చేనేతలకు అధునాతన సాంకేతికతపై శిక్షణ, డిజైనింగ్‌ కోసం కేంద్రప్రభుత్వ సహకారంతో కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. స్వర్ణకారుల కోసం 75ఎకరాల్లో జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేస్తున్నాం. ఏపీలోనే మంగళగిరిని నెం.1గా నిలపాలన్నది మా లక్ష్యం. కుప్పం, హిందూపురం మాదిరి మంగళగిరిని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారుస్తా. ఇందుకోసం గత పదినెలలుగా అహర్నిశలు కష్టపడుతున్నా. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద ప్రజల రెండున్నర దశాబ్దాల కోరికను ఈరోజు నెరవేర్చా. మంగళగిరిని చూశాక రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై వత్తిడి పెరుగుతుందని మంత్రి లోకేష్‌ అన్నారు.

3 విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు
ఈ రోజు ఉండవల్లిలో రాజమండ్రి గోవిందు కుటుంబానికి ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్‌ విలువ రూ.9 లక్షలు. మార్కెట్‌ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మాదిరి బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడం లేదు. పేదల దశాబ్దాల కల నెరవేరుస్తున్నాం. అటవీ భూముల్లో నివసించే వారికి ఆయా శాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు మూడువిడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉంటున్న 3వేల మందికి పట్టాలు ఇస్తున్నాం. 2వ విడతలో ఎండోమెంట్స్‌, రైల్వే భూముల్లో నివసించేవారికి ఇస్తాం, 3వ విడత మిగిలిన వారందరికీ పట్టాల అందజేతకు చర్యలు తీసుకుంటాం. కాల్వగట్లపై నివసించే వారికి ప్రత్యామ్నాయం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఆన్వేషిస్తున్నాం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌, సీఆర్‌డీఏ పరిధిల్లో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వేర్వేరు మోడల్స్‌ సిద్ధం చేస్తున్నాం. మంగళగిరిలో నాపై ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో నాకు వచ్చిన మెజారిటీ కంటే వారికి వచ్చిన ఓట్లు తక్కువ. కష్టపడి పనిచేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచానని మంత్రి లోకేష్‌ చెప్పారు.

Previous Post

రెడ్‌ బుక్‌ పేరు వింటే..వైసీపీ నేతలకు వణుకు

Next Post

పేదింటి గోవిందుకు..బట్టలు పెట్టి మరీ ఇంటి పట్టా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist