చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం!

దోబీ ఘాట్‌ సందర్శించి రజకులతో ముచ్చటించిన వైనం

by చైతన్యరధం
September 2, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏ అంశంపైనానే చర్చకు మేం సిద్ధం
  • వైసీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సవాల్‌
  • తెలుగువారికి పింఛను పరిచయం చేసిందే ఎన్టీఆరే
  • 30 ఏళ్లక్రితమే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని..
  • పాలనా వ్యవహారాల్లో ఏనాడూ విశ్రమించ లేదు
  • కూటమి గెలిచాకే ప్రజలకు స్వేచ్ఛ దొరికింది..
  • తప్పును నిలదీసే ధైర్యం ప్రజల్లో మరింత రావాలి
  • రాజంపేట ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు పిలుపు
  • ‘పేదల సేవలో’ భాగంగా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం
  • దోబీ ఘాట్‌ సందర్శించి రజకులతో ముచ్చటించిన వైనం

రాజంపేట (చైతన్య రథం): ఫేక్‌ ప్రచారం చేయడం కాదు… అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాలపై చర్చించాలని రాజంపేట ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీకి సవాల్‌ విసిరారు. పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజంపేట మండలం బోయినపల్లిలో సీఎం పర్యటించారు. కిడ్నీ పనిచేయక మంచానికే పరిమితమైన యడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఆమెకు స్వయంగా పింఛను అందించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ పథకాల లబ్దిదారులతో మాట్లడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అసెంబ్లీకి రాకుండా… సోషల్‌ మీడియాలో, పత్రికా సమావేశాల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీపై సీఎం విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘మొన్నటి వరకూ సిద్ధం, సిద్ధం అంటూ ఎగిరిపడిన 11మంది వైసీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలి.

ఎవరు సంక్షేమం చేశారో, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చు కుందాం. ఫేక్‌ ప్రచారాలతో ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేరు. క్లెమోర్‌ మైన్లతో పేల్చినా చలించని నేను ఎవరికీ భయపడను. సూపర్‌ సిక్స్‌ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు మొదలు.. బాబాయ్‌ హత్య, డోర్‌ డెలివరీ రాజకీయాలు, కోడి కత్తి డ్రామాలు, గులకరాయి ఎపిసోడ్లు, పులివెందుల-ఒంటిమిట్ట ఎన్నికలు.. ఇలా దేనిపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లు రక్తం పారించిన సీమలో మేం నీరు పారించాం. సీమలో ఫ్యాక్షన్‌ మాట వినపడకుండా చేశాం. రాష్ట్రంలో రౌడీ అన్న వాడు లేకుండా చేశాం. సొంత కార్యకర్తను కారుతో తొక్కించి.. నెపాన్ని మా మీద వేశారు. మామిడి కాయలు రోడ్డుపై తొక్కించి డ్రామాలాడిన వ్యక్తులు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మహిళలపై సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించి ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాం’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పింఛన్ల పంపిణీ దానం కాదు… బాధ్యత
‘‘పింఛన్ల పంపిణీ దానమో, ధర్మమో కాదు. అది ప్రభుత్వాల బాధ్యత. ప్రతి నెలా పింఛన్ల పంపిణీ పండుగగా జరుగుతోంది. గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చూశాం. ఇప్పుడు లక్షా 65 వేలమంది అధికారులు కేవలం 3 గంటల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు పింఛన్లు అందిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు రూ.42 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. ఈ సెప్టెంబర్‌ నెలలోనే పింఛన్ల కింద 63,61,380 మందికి రూ.2,747 కోట్లు వెచ్చించాం. 1983లో ఎన్టీఆర్‌ రూ.30తో పేదలకు పింఛనుకు శ్రీకారం చుట్టారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్‌ను రూ.75కు పెంచాను. 2014నాటికి రూ.200 ఉన్న పింఛన్‌ను మళ్లీ ఒకేసారి రూ.1,000కి పెంచాం. దివ్యాంగులకు రూ.1500 చేశాం. మళ్లీ 2018లో వృధ్యాప్య, వితంతు పెన్షన్‌ను రూ.2,000లకు, దివ్యాంగులకు రూ.3,000 చేశాం. ఐదేళ్లలో పింఛన్లు 10 రెట్లు, దివ్యాంగులకు 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం’’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఫేక్‌ పార్టీ- ఫేక్‌ పింఛన్లు
‘‘గత ప్రభుత్వంలో అవయవాలు సక్రమంగా ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేశారు. వారి పార్టీ కార్యకర్తలకు ప్రజల సంపదను దోచిపెట్టారు. ప్రభుత్వ ధనం దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలో వద్దో ప్రజలే చెప్పాలి. భర్త చనిపోతే భార్యకు పింఛను ఇవ్వని గత పాలకులు విమర్శలు చేస్తున్నారు. అర్హులకు మాత్రమే చెందాల్సిన సంక్షేమం.. అనర్హులకు ఇవ్వొచ్చా? వైసీపీ తీరును ప్రజలు గమనించాలి. తప్పును తప్పు అనే చెప్పే ధైర్యం ప్రజలకు రావాలి. మంచికి అండగా నిలబడాలి. అప్పుడే మాకు మరింత బలం చేకూరుతుంది. ప్రజలే నా బలం… బలగం. వారి కోసం మరింత సంక్షేమాన్ని అందిస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే భర్త చనిపోయిన నెలలోనే పింఛన్లు అందిస్తున్నాం. ఈ నెలలో రూ.3.14 కోట్లతో కొత్తగా 7,872 మందికి వితంతు పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 8,10,182 మంది దివ్యాంగ పింఛన్లు, మెడికల్‌ పింఛన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు ఇస్తున్న రూ.6 వేలల్లో రూ.5,550 పెంచింది తెలుగుదేశం ప్రభుత్వాలే. 2 నెలలుగా పింఛను తీసుకోని 1,20,187 మందికి రూ.101 కోట్లు, 3 నెలలుగా పింఛను తీసుకోని 11,986 మందికి రూ.15 కోట్లు అందించడం ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ప్రజలకు నిలదీసే స్వేచ్ఛను ఇచ్చాం
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే ప్రజలు చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి. 2014-19లో దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. 2019 నుంచి గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఐదేళ్లూ ప్రజల మొహాల్లో నవ్వులు లేవు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఎమ్మెల్యేలు అయినా సరే… తప్పు చేశారని భావిస్తే నిలదీయొచ్చు. ఇదే తరహాలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించే సంక్షేమం అందిస్తున్నాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహించాం. ఎంతమంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇచ్చాం. అన్న క్యాంటీన్‌, అన్నదాత సుఖీభవ అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. చేనేతలకు ఉచిత విద్యుత్‌, మత్య్సకారుల సేవలో భాగంగా వేట విరామ సమయంలో రూ.20 వేలు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనాలు పెంపు, 40వేలకు పైగా సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాం. రైతులకు 90 శాతం సబ్సీడీతో డ్రిప్‌ ఇస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

ప్రజా సేవే నా లక్ష్యం
‘‘సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ కాలంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అయినా వెనకడుగు వేయలేదు. సమైక్యాంధ్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా పని చేశాను. సంపద సృష్టించి, ప్రజలకు సంక్షేమం అందించాననే తృప్తి నాకుంది. రాజంపేటలో నేను కట్టిన దోబీ ఘాట్లు చూసి ఆనందించాను. 25 ఏళ్ల క్రితం ఈ ఘాట్లు నేను కట్టినవేనని వారు చెబితే సంతోషం వేసింది. ఈ 30 ఏళ్లలో ఏనాడూ నేను విశ్రమించ లేదు. నిద్ర లేచింది మొదలు మిషన్‌ తరహాలో పనిచేస్తాను. తెలుగు జాతి అగ్రస్థానంలో ఉందంటే అందుకు టీడీపీనే కారణం. నాడు హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యాం. నేడు అమరావతి నిర్మాణం చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉన్న బీసీల రుణం తీర్చు కోలేనిది. అనునిత్యం ప్రజా సేవలోనే ఉన్నాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

రాళ్లసీమను రతనాల సీమ చేస్తున్నాం
‘‘రాళ్ల సీమగా మారుతుందనుకున్న రాయలసీమను రతనాలసీమ చేస్తున్నాం. సీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. కరెంటు లేని పరిస్థితి నుంచి ఇంటిపైనే సౌర విద్యుత్‌ తయారు చేసే పరిస్థితి తెచ్చాం. పేదరికం నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డ్వాక్రా, సాగునీటి , సహకార సంఘాలు ఏర్పాటు చేశాం. చెప్పినట్టే సీమకు కృష్ణా జలాలు తెచ్చాం. సీమ అభివృద్దికి బ్లూ ప్రింట్‌ అమలు చేస్తున్నాం. కియాతో అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చేశాం. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌, స్పేస్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, డ్రోన్స్‌ రంగాలకు సీమను హబ్‌ చేశాం. గోదావరి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతుంటే సీమలో నీటి కోసం ఇబ్బందులు వస్తున్నాయి. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం’’ అని చంద్రబాబు వెల్లడిరచారు.

జిల్లాల విభజన సమస్యను పరిష్కరిస్తాం
‘‘రాజంపేటను అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం. జిల్లాల విభజనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరి చేస్తాం. రాజంపేట నియోజకవర్గం ప్రజలు ఎన్నికల్లో మాకు ఓటేయలేదు. కొన్ని కారణాల వల్ల రాజంపేట ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రాలేదు. అయినప్పటికీ రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. కూటమిని ఓడిరచారు. గెలిచిన వారిని చూసుకోవాలి… వారి సమస్యలు తీర్చాలి. అయినా రాజకీయాన్ని అభివృద్ధితో ముడిపెట్టను… అభివృద్ధి చేస్తాను. 2014లో టీడీపీ ప్రభుత్వమే ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయాన్ని అభివృద్ధి చేసింది. రాజంపేటకు మెడికల్‌ కాలేజీ కావాలని అడిగారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ప్రజలు అందరికీ సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. పీ4తో పేదరిక నిర్మూలన సాధ్యం చేసి చూపిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

దోబీ ఘాట్‌ సందర్శన… షెడ్లు నిర్మించాలని ఆదేశం
బోయనపల్లిలో దోబీ ఘాట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై రజకులను అడిగి తెలుసుకున్నారు. దోబీ ఘాట్లలో షెడ్లు నిర్మించాలని రజకులు కోరగా వెంటనే తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే దోబీ ఘాట్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా… అధికారులకు తెలియచేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహా జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక టీడీపీ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

నేడు లోకేశ్‌ కడప పర్యటన

Next Post

నవ్యాలోచనలే నా సక్సెస్‌!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post
నవ్యాలోచనలే నా సక్సెస్‌!

నవ్యాలోచనలే నా సక్సెస్‌!

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.