శాన్‌ఫ్రాన్సిస్కో/యూఎస్‌ఏ (చైతన్యరథం): కాన్వా (జaఅఙa) చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ (సీసీఎస్‌ఓ) రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్ లతో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.65 వేల కోట్ల వ్యయంతో ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కోరారు. దీనిపై కాన్వా సీసీఎస్‌ఓ రాబ్ గిగిలియో మాట్లాడుతూ… ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజింగ్, మనీలా, ఆస్ట్రిన్ నగరాల్లో ప్రధాన కార్యాలయాలు కలిగి విస్తృతమైన రిమోట్ వర్క్‌ఫోర్స్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, డాక్యుమెంట్లు, పోస్టర్లు, వీడియోల తయారీకి సరళీకృతమైన, క్లౌడ్-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్‌లను కాన్వా అందిస్తుందన్నారు. తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. (కాన్వా సంస్థ 40 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటైజేషన్ తో గత ఏడాది 2.5 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సాధించింది












