- వ్యక్తిత్వ హననం వైసీపీ నేతల నైజం
- నా కష్టం, నా నిజాయితీ అందరికీ తెలుసు
- అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించడం వైసీపీ నేతల అలవాటు
- అధికారం రాకముందు పేర్ని నాని బతుకేమిటో అందరికీ తెలుసు
- మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి (చైతన్యరథం); తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని, లీగల్ నోటీసులు పంపిస్తానని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా తలపడడం చేత కాక టీడీపీ నేతల మనో స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వ్యక్తిత్వ హననం చేయడం వైసీపీ నేతలకు బాగా అలవాటని మంత్రి అనగాని మండి పడ్డారు. ఈ పనులన్నీ వారి నేత జగన్ చేస్తాడని, అదే దారిలో పేర్నీ నాని కూడా: తనపై అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. రీ సర్వే మొదట టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని, కేంద్ర ప్రభుత్వ మార్గ దర్వకత్వంలో భూమి రికార్డుల డిజిటి లైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అన్ని ఆధారాలను తాను చూపించానని చెప్పా రు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను హడా విడిగా చేయడం వల్ల చాలా తప్పులు దొర్లాయని, వాటిని తాము సరి చేస్తున్నా మని తాను చెప్పానని అన్నారు. పేర్నీ నాని ప్రెస్ మీట్లోనే వారి ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్ తెరుచుకోని పరిస్థితి కనిపించింద న్నారు.
అయితే పేర్నీ నాని అసలు విష యాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగారని, వైసీపీ పార్టీ నేతలంతా నీతి, నిజాయితీ లేని నాయకులేనన్నారు. అధి కారంలోకి రాకముందు పేర్ని నాని బతు కేమిటో అందరికీ తెలుసునని, అధికారా న్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాందిం చడం వైసీపీ నేతలకు అలవాటన్నారు. స్కూటర్ పైన తిరిగేందుకు పెట్రోలు డబ్బులు కూడా లేని పేర్ని నాని అధికారంలోకి రాగానే అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాడో అందరికీ తెలుసునని అన్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పిన పేర్ని నానికి ప్రెస్ మీట్లు పెట్టే హక్కే లేదన్నారు. డబ్బులు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, తానేంటో, తన కష్టం, నిజాయితీ ఎంటో తెలుగు ప్రజలందరికీ తెలుసునని, బందరులోని ప్రజలకు కూడా తెలుసునని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్ట లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనం లాంటి గొప్ప నేతలు ఆ పార్టీ వైఖరి నచ్చక టీడీపీలోకి వచ్చారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు.














