చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు

శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్

by చైతన్యరధం
Feb 14, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు
  • గత పాలకమండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు
  • గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు
  • రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాలి
  • ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
  • శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్

అమరావతి (చైతన్యరథం): ‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి. నాటి పాలకమండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ఆలయాల పాలకమండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గిరి ప్రదక్షిణ మార్గాన్ని శుక్రవారం ఆయన వెలగపూడిలోని సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ “మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయి.

అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు. నాకు గిరి ప్రదక్షిణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాను. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటతాం
శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రూ.10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించాం. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికీ కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ.. ఆలయాలను, ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా దేవదాయ శాఖ సహకారంతో ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్న కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును 3కోట్ల 70లక్షల వ్యయంతో చేపట్టాం. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇటీవల కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డును సుమారు రూ.4 కోట్లతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి సాస్కీ నిధులు రూ.6కోట్లు మంజూరు చేశాం.

ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులతో రూ.40 కోట్లకు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు వసతి కల్పిస్తున్నాం. మరెన్నో చిన్న ఆలయాలకు రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని సూచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది’ అని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుంచి వర్చువల్‌గా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్ సెల్వం, డీఎఫ్‌వో సాయిబాబా, శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Previous Post

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

Next Post

అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం..

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-02-2026

కార్యకర్త
@ February 14, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం
ఆంధ్రప్రదేశ్

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
ఆంధ్రప్రదేశ్

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

జేఎన్‌టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెలలో చట్టాన్ని సవరిస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం..
ఆంధ్రప్రదేశ్

అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం..

చైతన్యరధం
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనపు నిధులు సాధించాలి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist