అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం ప్రయోగశాల
ఎంతో ఆదరించారు..వారి రుణం తీర్చుకుంటాం
సమాజాభివృద్ధిలో మహిళా శక్తి కీలకం
ప్రోత్సాహకాలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం(చైతన్యరథం): రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్య మని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచే ముఖ్య మంత్రి మొదలుపెడతారని పేర్కొన్నారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర..వారు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు..వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది..వాటిని అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎద గాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మంకలదొడ్డి, సింగారపురం, మోట్లచెను, కూసురు గ్రామాల్లో పర్యటించిన ఆమె మహిళలతో సమావేశమయ్యారు.
కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాం
ముందుగా కుప్పం నియోజకవర్గం మంకలదొడ్డి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరికి స్థానికులు ఘన స్వాగతం పలి కారు. గ్రామంలోని కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉం టుంది. ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు. చంద్రబా బును 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ముఖ్యమంత్రిగా ఆయన నియోకవర్గంలోని ప్రతి గ్రామం తిరగడం సాధ్యం కాదు..అందుకే ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ పర్యటిస్తున్నాను. గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో స్వయం గా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి నా వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల దీవెనలు మర్చిపోలేను
గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. రాష్ట్రాన్ని బాగుచేయడం చంద్రబాబు వల్లే అవుతుందనే నమ్మకం తో ప్రజలు గెలిపించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నేను గతంలో పబ్లిక్‌గా మాట్లాడింది లేదు. హెరిటేజ్ వ్యవహారాలు మాత్రమే చూసుకునేదాన్ని. నిజం గెలవాలి యాత్ర చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు నన్ను ముందుండి నడిపించారు. వారు అందించిన సహకారం నేను ఎప్పటికీ మర్చి పోలేను. సమాజం అభివృద్ధి చెందడంలో మహిళలదే ముఖ్యపాత్ర. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభ పరిణామం. వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. పురుషులు తమ వృత్తిలో రాణిం చాలంటే కుటుంబ మద్దతు ఎంతో అవసరం. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు తాను, బ్రాహ్మణి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
కుప్పానికి పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు
ఒక పరిశ్రమ పెట్టే ముందు పారిశ్రామికవేత్తలు లాభ,నష్టాలు బేరీజు వేసుకుంటారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు. కూటమి ప్రభుత్వంలో వచ్చాక సీఎం చంద్రబాబు పాలనా దక్షతపై నమ్మకంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి రూ.7,121 కోట్ల విలువైన పెట్టుబడులతో 17 పరిశ్రమలు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 2,203 కోట్ల పెట్టుబడులతో 7 పరిశ్రమలు స్థాపించారు. వీటి ద్వారా 7093 మందికి ప్రత్యక్షంగా, 15,237 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్ వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మహిళలు స్వయం సమృద్ధి సాధించడం కోసం చంద్రబాబు ఎలీప్ సంస్థను కుప్పానికి తీసుకొచ్చారు. ఇందులో శిక్షణ తీసుకున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. చెత్త ద్వారా సంపద సృష్టికి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ స్పోర్ట్ కాంప్లెక్స్ తెచ్చారు. మంకలదొడ్డి గ్రామానికి రోడ్ కనెక్టివిటీ నిమిత్తం రూ.4 కోట్లకు పైగా వ్యయంతో బీటీ రోడ్లు వేశారని తెలిపారు. కుప్పం మండలం టి.సదుమూరు గ్రామంలో అంగన్వా డీ కేంద్రాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. టి.సదుమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
గత పాలకులు రాష్ట్రాన్ని దోచేశారు
సింగారపురంలో మారెమ్మ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం గ్రామ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. గత పాలకులు రాష్ట్రాన్ని దోచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల కష్టాలు తీరాయి. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు చంద్రబాబుపై ఉన్న నమ్మకమే కారణం. కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తోంది. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకాబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజా ప్రభుత్వం పీ4 ద్వారా పేదలను ఆర్థికంగా పైకి తెస్తోంది. కుప్పం నియోకవర్గంలో ప్రతి గ్రామానికి సంక్షేమం అందేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. సింగారపురం గ్రామానికి రూ.23 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. స్థానికం గా బ్రిడ్జ్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తున్నారు. నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నారు. ఎలీప్ ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని పారిశ్రామివేత్తలుగా ఎదగాల ని పిలుపునిచ్చారు.
కుప్పం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకదృష్టి
కుప్పం మండలం మోట్లచెను గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి ముందుగా మాజీ ఎంపీటీసీ నివాసానికి వెళ్లారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. తర్వాత కూసూరు గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమం అందుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందిరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తున్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. మహి ళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సంజీవని హెల్త్ క్లీనిక్స్ ద్వారా పేదలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నారు. మోట్ల చెను పంచాయతీల పరిధిలో 104 స్ట్రీట్ లైట్స్ అమర్చారు. సీఎంఆర్ ఎఫ్ కింద ఐదుగురికి ఆర్థిక సాయం అందింది. జలజీవన్ మిషన్ కింద 100 ఇళ్లకు కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఎన్టీఆర్ స్పూర్తితో సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నారని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో సీఎం చంద్రబా బు ముందుకెళుతున్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వా ములు కావాలని కోరారు.
జీవితంలో క్రమశిక్షణ ముఖ్యం
కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో విలువల బడి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొని విద్యార్థులతో ముచ్చటించా రు. విద్యార్థులు చిన్నతనం నుంచి వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. నేను చదువుకునేప్పుడు మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ఉండేది. ఆ తర్వాత కాలంలో సబ్జెక్ట్ తీసేశారు. ఈ సబ్జెక్ట్ పెట్టా లని లోకేష్‌ని కోరాను. నాన్న ఎన్టీఆర్ పేద కుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చారు. చిన్నతనంలో ఆయన సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి పాలు అమ్మేవారు. వీధి దీపాల కింద కూర్చు ని చదువుకునేవారు. చంద్రబాబు కూడా చిన్నతనంలో కిలోమీట ర్లు నడిచి బడికి వెళ్లేవారు. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర ముఖ్యమైంది. పిల్లలు అదే పనిగా సెల్‌ఫోన్లు వాడటం ప్రమాదా నికి దారితీస్తోంది. టెక్నాలజీని అవసరానికే వాడాలి. చిన్నతనం లో ఫోన్లు, టీవీలు లేవు కాబట్టే సంతోషంగా ఉండేవారమని పిస్తుంది. అన్ని మాకే తెలుసు అనే అహంభావం ఎవరికీ ఉండకూడదు. అహంకారం మనల్ని పాతాళానికి నెట్టేస్తుంది. పిల్లలు క్రమశిక్షణగా ఉండి తల్లిదండ్రులను గౌరవించాలి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై మనుషుల మధ్య దూరం పెరిగింది. మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం వల్లే మేమంతా కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు.

















