- 8 మంది మృతి, పలువురికి గాయాలు
- సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- అత్యుత్తమ వైద్యసేవలకు ఆదేశం
- ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
- మృతులు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటన
- ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హెూంమంత్రి
విశాఖపట్నం(చైతన్యరథం): విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమా దంలో మృతుల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది.
స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో మోల్టెన్ మెటల్ (ద్రవ లోహం) తరలిస్తున్న ల్యాడల్కు సంబంధించిన బకెట్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్లో ఉన్న 1500డిగ్రీల వేడితో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమా దానికి గురయ్యారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణనష్టం వాటిల్లింది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవే దన వ్యక్తంచేశారు.
క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయా లని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించా లని ఆదేశించారు. కాగా ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాల్లో ఏవైనా లోపాలుఉన్నాయా? సాం కేతిక కారణాల వల్లే ప్రమాదం సంభవించిందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు అధికారిక నివేదిక వెలువడిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ సంతాపం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన భారీ ప్రమా దంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. బాధితులకు అవసరమైన తక్షణ సహాయాన్ని స్థానిక అధికారులు అందజేస్తారని తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. మృతుల కటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయక నిధి నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50, 000 సాయం అందజేస్తామని తెలిపారు.
మృతుల కుటుంబాలకు లోకేష్ సంతాపం
విశాఖ స్టీల్స్టాంటు ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులకు వైద్యం,ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి: హోంమంత్రి అనిత
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ప్రమాదంపై వెంటనే స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగా త్రులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం పర్యటనలో ఉన్నప్పటి కీ ప్రమాద సమాచారం అంది న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి హోంమంత్రి బయలుదేరారు.















