అమరావతి (చైతన్య రథం) రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరుపున సానా సతీష్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ు సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముగ్గురూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి తమ నామినేషన్లు అందజేశారు. ఈ ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. సానా సతీష్ రెండు సెట్ల నామినేషన్లు సమర్పించగా, చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు (నానాజి), తంగిరాల సౌమ్యలు ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. బాష్యం రామకృష్ణ రెండు సెట్ల నామినేషన్లు సమర్పించగా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి. రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు ప్రతిపాదకులయ్యారు.
చింతకాయల విజయ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్కుమార్, బోడే ప్రసాద్లు ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయకుమారితోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ), వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), వరుపుల సత్యప్రభ, బండారు సత్యానందరావు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ తదితర నేతలు పాల్గొన్నారు.















