- ప్రధాని మోదీ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు
- సంస్కృతి, విలువలే విశ్వగురుగా నిలిపాయి
- వాటిని కాపాడుకుని భావితరాలకు అందించాలి
- ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రచారం
- సంజీవనిలోనూ యోగాసాధన, ప్రాణాయామం
- రాజధానిలో ఆధ్యాత్మికం, పర్యాటకానికి పెద్దపీట
- సాంకేతిక వినియోగం..వ్యవసం కాకూడదు
- ప్రచారానికి సంకల్పించిన రామ్ దేవ్క ధన్యవాదాలు
- ఉండవల్లి గుహల్లో యోగాంధ్రలో సీఎం చంద్రబాబు
- బాబు యోగి, కర్మయోగి: బాబా రామ్ దేవ్ కితాబు
అమరావతి(చైతన్యరథం): మన సంస్కృతి, విలువలే భారత దేశాన్ని ప్రపంచానికి విశ్వగురు స్థానంలో నిలిపాయని ముఖ్య మంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వాటిని కాపాడుకుని భావితరా లకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందని సూచిం చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్ దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి హాజరయ్యారు. యోగాంధ్ర లోగో ఉన్న చొక్కాను ధరించి వేశారు. బాబా రామ్ దేవ్ నేతృత్వంలో జరిగిన యోగా భ్యాసాన్ని తిలకించారు. వివిధ రకాల యోగాసనాలను రామ్ దేవ్ వివరించారు. సీఎం చంద్రబాబు ఎదుట చక్రాసనం, వృశ్చికాస నం, మయూరాసనం, హనుమానాసనం, రాజ్ కపోతాసనం, పవర్ యోగా వంటి ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బాబా రామవ్తో నాకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వేలాది మంది స్వచ్చందంగా వచ్చి ఆయన దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారు. యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినందుకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు. నేను 30 ఏళ్ల నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను.. రామ్హవ్ బాబా యోగా ను ప్రమోట్ చేస్తున్నారు. టెక్నాలజీ వితవుట్ అడిక్షన్ అనే విధానంలో వెళ్లాలి.. దీనికి ఆధ్యాత్మిక, యోగా వంటివి ఉపకరి స్తాయి. యోగాతో శరీరం, మెదడు అనుసంధానం అవుతాయి. అమరావతి, విజయవాడల్లోని వివిధ ప్రాంతాల్లో యోగా భ్యాసం చేస్తూ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి సంకల్పించిన రామ్ దేవ్ బాబాకు ధన్యవాదాలు. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నా. యోగా సాధన కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి. ప్రస్తుత తరానికి యోగా సాధన ను అలవాటు చేస్తే అద్భుతమైన భవిష్యత్తును అందించినట్టే. యోగాకు ప్రాచుర్యం లభించేలా చేయడంతో పాటు రాష్ట్రంలోని వివిధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర నిర్వహిస్తు న్నాం. దాంట్లో భాగంగా ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషం. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహల కు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. పద్మనాభ స్వామి ఈ ఉండవల్లి గుహల్లో కొలువై ఉన్నాడని చెప్పారు.
రసాయన రహిత పంటలు.. యోగా సాధనతో ఆరోగ్యం
ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు.. 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా యి. భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేసేవి మన సంస్కృతి, విలువలే. అలాంటి మన దేశ సంస్కృతిని ప్రపంచ దేశాల ముందు ఉంచిన ఘనత మోదీకే దక్కింది. మన విలువల ను కాపాడుకోవాలి.. భావితరాలకు అందించాలి. ఆధ్యాత్మికతో కూడిన వికసిత్ భారత్ సాధించాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు.. ఆయనకు సహకరిద్దాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేం దుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహి స్తున్నాం.. 20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు. రసాయన రహిత పంటలను ప్రజలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజారోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. సంజీవనిలో భాగంగా యోగాసాధన, ప్రాణా యామం వంటివి కూడా చేరుస్తున్నాం. సంజీవని కార్యక్రమంలో రోగ చికిత్స కంటే రోగ నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నాం. నివాస యోగ్య ప్రాంతంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. అమరావతి భవిష్యత్ నగరమని చెప్పారు.
సీఎంలు చంద్రబాబులా పనిచేయాలి: రామ్ దేవ్ బాబా
ఉండవల్లి గుహల వద్ద తన శిష్యులతో కలిసి యోగాభ్యాసం నిర్వహించిన రామ్వ్ బాబా సీఎం చంద్రబాబు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. యోగా మన దేశానికి గర్వకారణం. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా రమ్మన్నారు.. కానీ యోగా అతిథిగా వచ్చాను. ఈ వయసులో కూడా చంద్ర బాబు ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన అభివృద్ధి, విజన్ కలిగిన ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగు ణంగా కృషి చేస్తున్నారు. ఏక్ భారత్… శ్రేష్ట్ భారత్ అనే నినాదం తో ప్రధాని పనిచేస్తున్నారు.. దానికి చంద్రబాబు సహకరిస్తున్నా రు. ఆత్మనిర్భర్ భారత్ కోసం కృషి చేస్తూ భారతదేశాన్ని విశ్వగు రుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడ య్యారు. చంద్రబాబు తరహాలో ప్రతి ముఖ్యమంత్రి పనిచేస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారం అవుతుంది. ప్రజా రాజధాని అమరావతి.. ఇప్పుడు యోగా రాజధాని అయిం ది. రాజధానిని పచ్చదనంతో విలసిల్లేలా నిర్మిస్తున్నారు. స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న అందాలు అమరావతిలో ఉన్నాయి. ఉండవల్లి గుహల్లో కొలువైన పద్మనాభస్వామిని దర్శించుకున్నాను. ఇక్కడి అరటి, మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసా యాన్ని సీఎం చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, యోగ ప్రేమికుడు సర్వజన ప్రేమికుడు. చంద్రబాబు యోగి, కర్మయోగి అని ప్రశం సించారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













