చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రూ.34వేల కోట్ల పెట్టుబడులు.. 35వేల ఉద్యోగాలు

అమరావతి, విశాఖలను ప్రపంచస్థాయి డేటా సెంటర్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యం

by చైతన్యరధం
Jun 24, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రూ.34వేల కోట్ల పెట్టుబడులు.. 35వేల ఉద్యోగాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీ కేబినెట్ చారిత్రక నిర్ణయాలు
  • పెట్టుబడులతో ప్రగతి పథంలో ఏపీ
  • కేబినెట్‌లో 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్
  • పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, డేటా సెంటర్లకు విస్తృత ఆమోదం
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రక్షణ పరిశ్రమ దాకా.. వైవిధ్యభరిత పెట్టుబడులకు స్వాగతం
  • ప్రభుత్వరంగ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60నుంచి 62కి పెంపు
  • అమరావతి, విశాఖలను ప్రపంచస్థాయి డేటా సెంటర్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యం
  • సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూకేటాయింపు.. పర్యావరణ లక్ష్యాలకు పెద్దపీట

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు రూ.34వేల కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35వేల ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొదటి, రెండో దశ కోసం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1388వ (51వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధి, యువతకు భారీస్థాయిలో ఉపాధి అవకాశాల కల్పన, ప్రపంచస్థాయి పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణ అనే ప్రధాన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. “రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, డేటా సెంటర్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, యువతకు భారీ ఉపాధి అవకాశాల కల్పన అనే లక్ష్యాలతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోంది. పెట్టుబడులు -పరిశ్రమలు -ఉపాధి -సుస్థిర అభివృద్ధి అనే అంశాలలో ఏపీని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్య”మని వివరించారు.

యువతకు భారీస్థాయిలో ఉపాధి
“రాష్ట్రంలోని లక్షలాది యువతకు నాణ్యమైన ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పరిశ్రమల స్థాపన ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కేవలం పెట్టుబడులను ఆహ్వానించడం మాత్రమే కాకుండా, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి అనుగుణంగానే క్యాబినెట్ వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకుంది” అని పేర్కొన్నారు.

ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధి
“ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఆటోమొబైల్ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ యూనిట్లు, టాయ్స్ తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, అనుబంధ పరిశ్రమలు తదితరములు అన్నీ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లే పరిశ్రమలను రాష్ట్రంలోనే నిలబెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుం”దని మంత్రి కొలుసు వివరించారు.

సహజ వనరులను సద్వినియోగం
రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, పోర్టులు, రహదారి అనుసంధానంవంటి వాటిని ఉపయోగించుకుని పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అదేవిధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రాంతీయ అభివృద్ధికి ప్రోత్సాహం అందించనుందని వివరించారు.

డేటా సెంటర్ల స్థాపనకు ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రపంచస్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. మరికొన్ని కంపెనీలు భూముల కేటాయింపు, అనుమతుల దశలో ఉన్నాయి. ఈ డేటా సెంటర్ల ద్వారా వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువంటి రాష్ట్రాలు డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం నగరాలను ప్రపంచస్థాయి డేటా సెంటర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

స్టార్టప్‌లు -యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
ప్రతి యువకుడు ఉద్యోగం కోరేవాడిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పెట్టుబడుల సులభతరం, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనవంటి చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని మంత్రి కొలుసు వివరించారు.

పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం
డేటా సెంటర్ల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతుందనే అనుమానాలు ఏమాత్రం వద్దు. డేటా సెంటర్లలో ప్రధానంగా కంప్యూటింగ్ పరికరాలే ఉంటాయి. ప్రమాదకర రసాయనాల వినియోగం ఉండదు. పరిశ్రమల తరహా కాలుష్యం ఉత్పత్తి కాదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎన్విరాన్‌మెంట్ నిబంధనలు అమలు చేస్తారు. అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారన్నారు.
కూలింగ్ వ్యవస్థలపై స్పష్టత
డేటా సెంటర్లలో ఉపయోగించే కూలింగ్ వ్యవస్థలపై కూడా ఎటువంటి అనుమానాలు వద్దు. ఆధునిక, శక్తి పొదుపు కూలింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలను అమలు చేస్తారు. ఎటువంటి రసాయన కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యర్థ జలాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తారన్నారు.

నేడు జరిగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు….
ఎసఐపీబీ సిఫార్సుల మేరకు రూ.2,250 కోట్ల పెట్టుబడి, 530మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో నియోడైమియం-ఐరన్-బోరాన్ అయస్కాంతాల తయారీ సంస్థ ‘మెసర్స్ ప్రొటెరియల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ’కు, రూ.1,250 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అధిక సామర్థ్యంగల అరుదైన ఎర్త్ పర్మనెంట్ అయస్కాంతాల స్వదేశీ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనున్న ‘నాన్ మాగ్నెటెక’ సంస్థకు ప్రత్యేక రాయితీలు మంజూరు చేయడంతో పాటు, రెండు కంపెనీలకు కంఫర్ట్ లెటర్స్ జారీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఓకె చెప్పింది. అలాగే, ప్రకాశం జిల్లాలో రూ.1,230.2 కోట్ల భారీ పెట్టుబడితో, 155 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించేలా ‘ఏపీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ’ ప్రతిపాదించిన స్టీల్ బెనిఫిసియేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలను మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో అర్హత కలిగిన పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ‘వయోనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ’, ‘బెర్జర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ’, ‘డివైజ్ ఫార్మా టెక్ ప్రైవేట్ లిమిటెడ’, ‘ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ’ మరియు ‘మెసర్స్ రెనాటస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ’ సంస్థలకు “ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ” కింద రాయితీలు పొడిగించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ‘మెసర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ’ తన ప్లాంట్‌ను 5 గిగావాట్స్ నుండి 10 గిగావాట్స్‌కికి విస్తరించి, రూ.5,947.20 కోట్ల సవరించిన పెట్టుబడితో 1,040 మందికి ఉపాధి కల్పించే ఇన్గోట్ మరియు సిలికాన్ వేఫర్ మాడ్యూల్ తయారీ ప్రాజెక్టుకు, అలాగే అదే ప్రాంతంలో రూ.4,200.07 కోట్ల పెట్టుబడి, 2,000 మంది ఉపాధి లక్ష్యంతో 8 గిగావాట్స్ సోలార్ పీవీ టాప్‌కాన్ సెల్ తయారీ కేంద్రాన్ని స్థాపించే ప్రాజెక్టుకు సవరించిన ప్రత్యేక రాయితీలను మంజూరు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

తిరుపతి జిల్లా నాయుడుపేటలో కార్మికులు మరియు సిబ్బంది కోసం అందుబాటు ధరలో అద్దె గృహాల ప్రాజెక్ట్‌ను స్థాపించాలన్న ‘మెసర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ’ ప్రతిపాదనకు ఆమోదం తెలపడమైనది. సదరు ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్ రోడ్డు, విద్యుత్ సరఫరా మరియు భూసేకరణ వ్యయాల కొరకు ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ బడ్జెట్ నుండి రూ.1.95 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మెసర్స్ వోల్టుసన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ’ సంస్థకు గతంలో ఆమోదించిన ధరకే అదనంగా ఆనుకుని ఉన్న 4.82 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలపడమైనది. సంస్థ యొక్క సవరించిన స్థిర మూలధన పెట్టుబడి రూ.1,280 కోట్లకు పెరగడం మరియు ప్రాజెక్ట్ అమలు గడువును కుదించిన నేపథ్యంలో, దానికి అనుగుణంగా రాయితీలను సర్దుబాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

తిరుపతి జిల్లాలో రూ. 2,508 కోట్ల పెట్టుబడి మరియు 3,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో గ్రీన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ‘మెసర్స్ రాయల్ ఎన్‌ఫీల్డ’ (ఐషర్ మోటార్స్ లిమిటెడ్) సంస్థకు ప్రత్యేక రాయితీలు మంజూరు చేస్తూ గతంలో జారీ చేసిన జీవోకు అవసరమైన సవరణలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలో ‘మెసర్స్ జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ’ సంస్థకు ఎలక్ట్రిక్ 3-వీలర్లు (ఆటోలు) మరియు రెట్రో ఫిట్‌మెంట్ కిట్ల తయారీ కేంద్రం స్థాపనకు అక్కడ సాధారణ రాయితీ కేటాయింపుల తరహాలోనే ఎకరాకు రూ.30 లక్షల చొప్పున 48.14 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదించింది.

ఎస్‌పిఎసఆర్ నెల్లూరు జిల్లా దత్తలూరులో క్షిపణులు, లోయిటరింగ్ మ్యునిషన్ ఉత్పత్తి కేంద్రం కోసం ‘మెసర్స్ అనంత్ టెక్నాలజీస’కు 300 ఎకరాలు, అనంతపురం జిల్లా తిమ్మసముద్రం ఐపీలో సాలిడ్ ప్రొపెలెంట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ కోసం ‘మెసర్స్ స్పేస్‌ఫీల్డ్స’కు 120.76 ఎకరాలు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రక్షణ పేలుడు పదార్థాల తయారీ కేంద్రం కోసం ‘మెసర్స్ ఐకామ్ టెలి లిమిటెడ’కు 300 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే సరికొత్త సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు పైన 11 ప్రముఖ సంస్థల ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టుల స్థాపనను వేగవంతం చేసే సమగ్ర ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Previous Post

ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా

Next Post

ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా..

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’
ఆంధ్రప్రదేశ్

గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

చైతన్యరధం
@ June 24, 2026
కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు
ఆంధ్రప్రదేశ్

కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు

చైతన్యరధం
@ June 24, 2026
“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ June 24, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా..

చైతన్యరధం
@ June 24, 2026
ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

చైతన్యరధం
@ June 24, 2026
కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు

కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు

చైతన్యరధం
@ June 24, 2026
“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్

“సర్” ప్రక్రియలో పాల్గొన్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ June 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist