- తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో
- రైతుల ప్రయోజనాలు కాపాడాం
- ఏపీ, కర్ణాటక, తెలంగాణ
- సీఎంల సమావేశం చారిత్రాత్మకం
- మÖడు రాష్ట్రాల అభివృద్ధిలో తుంగభద్ర కీలకం
- హోస్పేట బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఇద్దరు సీఎంలతో తుంగభద్ర క్రస్ట్ గేట్ల ప్రారంభం
- హాజరైన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
హోస్పేట/కర్నాటక(చైతన్యరథం): కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తుంగభద్ర ప్రాంత రైతుల ప్రయోజనా లపై చర్చించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాలు వేరైనా దేశంగా మన మంతా ఒక్కటేనని, రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగు నీటిని, ప్రజలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. 2024 ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టులో 19వ నెంబరు గేటు కొట్టుకుపోవటంతో తక్షణం స్పందించి స్టాప్‌లాక్ గేట్ అమర్చామని తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులో భాగంగా రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ గేట్ల ప్రారంభోత్సవం లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు. తుంగభద్ర డ్యామ్‌లోని సీఎం చంద్రబాబు 19వ నెంబర్ గేటు, కర్ణాటక ముఖ్యమంత్రి 18వ గేటును, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ 17వ గేటును, 20 గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర ప్రాజెక్టు, జలాల వినియోగంపై సమావేశమయ్యారు. మూడు రాష్ట్రాల ప్రయోజనా లపై నలుగురు నేతలు విస్తృతంగా చర్చించారు.
దేశ భవిష్యత్‌కు నదుల అనుసంధానం అవసరం
2024లో 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టామని, ప్రస్తుతం 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించి ప్రాజెక్టును మరింత బలోపేతం చేశామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని వెల్లడించారు. ‘తుంగభద్ర నది చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తుచేశారు. విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి తుంగభద్ర నది సహజ రక్షణ కవచంగా నిలిచిందన్నారు. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష ఆలయం, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం నదుల అనుసంధానం అత్యంత అవసర మని అభిప్రాయపడ్డారు. కెన్-బేత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారతదేశంలో నదుల అనుసంధానం విజయవంతంగా అమల వుతోందని, అదే తరహాలో గోదావరి-కావేరి అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయని తెలిపారు. 1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనా డుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారని, ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగు నీటిని అందించామని గుర్తు చేశారు. గంగా- కావేరీ నదుల అనుసంధానం జరిగితే భారత్ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు.
నీటి వనరులు పొదుపుగా వినియోగించాలి
ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగిం చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముందుగా రాష్ట్రాలు అంతర్గతంగా నదుల అనుసంధానం చేపట్టి ఆ తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానానికి అడుగులు వేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే అన్ని ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్య మని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరిగిన ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అంతా కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులను పరిరక్షించుకుంటే దేశాభి వృద్ధికి అవి కీలకం అవుతాయని అన్నారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తెలం గాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా మూడు రాష్ట్రాల స్థాని క ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.















