- అమరావతిలో బాలయ్య 112 సినిమా
- క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభోత్సవం
అమరావతి(చైతన్యరథం): ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరి గింది. వెలగపూ డిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. బాలయ్య బాబు నాయకత్వం లో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపా యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తోంది. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఇది పవిత్ర భూమి. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.














