చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం

వెల్లడించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Aug 7, 2026 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కేబినెట్ కీలక నిర్ణయాలు
  • వెల్లడించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 1391వ (54వ) మంత్రిమండలి సమావేశం గురువారం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు కీలక అంశాలపై చర్చించి, ప్రతిష్టాత్మక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అనంతరం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ: విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ కార్యక్రమం కింద జీవీఎంసీ పరిధిలోని జోన్`4, వార్డు నెం.35లో ఉన్న వెలంపేట మురికివాడ పునరాభివృద్ధిని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్‌కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. జీవీఎంసీ యాజమాన్యంలోని 1,986.45 చ.మీ. స్థలంలో ప్రస్తుతం నివసిస్తున్న 177 ఈడబ్ల్యుఎస్ కుటుంబాలకు అక్కడికక్కడే పునరావాసం కల్పించేందుకు షేర్‌వాల్ టెక్నాలజీతో స్టిల్టం12 అంతస్తుల భవనం నిర్మించనున్నారు. పీపీపీ/డీబీఎఫ్‌టీ విధానంలో 24 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు టీడీఆర్ ద్వారా రూ.17.07 కోట్ల నిధుల కొరతను భర్తీ చేస్తారు. ఈ ప్రాజెక్టును ‘వీఈఆర’ కార్యక్రమం కింద ఇతర మురికివాడల పునరావాసానికి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026

చేనేతకు చేయూత

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రెయిన్ (పాదచారులు) సేఫ్టీ, యునివర్సల్ ఆక్సెస్బిలిటీ పాలసీ-2026ను, దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ప్రకారం పాదచారుల మరణాలను పూర్తిగా నివారించే లక్ష్యంతో జీరో టాలరెన్స్ విధానం అమలు చేసి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి అవరోధరహిత, సురక్షిత పాదచారి మార్గాలను ఏర్పాటు చేయాలి. అన్ని పట్టణ రహదారులపై శాస్త్రీయ రోడ్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించి గత 2-3 సంవత్సరాల ప్రమాద డేటా ఆధారంగా అధిక ప్రమాదాలు నమోదైన 15-20 బ్లాక్‌స్పాట్‌లు, కూడళ్లు, పాఠశాలలు, అధిక పాదచారుల రద్దీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఐఆర్‌సీ ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్‌లు, సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లైటింగ్ తదితరాలను భద్రతాపరంగా మెరుగుపర్చాలి. ఆక్రమణల నియంత్రణకు జీఐఎస్ మ్యాపింగ్, సీసీటీవీ, కెమెరా ఆధారిత పర్యవేక్షణ చేపట్టి ఏడాదిలో కనీసం 20% రోడ్లను దశలవారీగా సర్వే చేసి గుర్తించిన లోపాలను వేగంగా పరిష్కరించాలి. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు ఐఈసీ ప్రచారాలు, సామాజిక పోలీసింగ్, ఆర్‌డబ్ల్యుఎ/టీ, పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రవర్తనా మార్పు తీసుకురావాలి.
అలాగే సీఅండ్‌డీ వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేసి ఫుట్‌పాత్ టైల్స్, కర్బ్‌లు, బొల్లార్డులు, వీధి ఫర్నిచర్ వంటి మౌలిక వసతుల తయారీలో వినియోగించేలా రాష్ట్రస్థాయి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతుల వైఫల్యాలకు వ్యక్తిగత బాధ్యత నిర్ధారించి, సెక్షన్ 198(ఎ) కింద అవసరమైన శిక్షలు, రూ.లక్ష వరకు జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టాలి.

న్యాయ`హోం శాఖ:
ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, విచారణ కోసం ఉద్దేశించిన “ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు-క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019”ను రాష్ట్రపతి ఆమోదం కోసం గతంలో పంపిన ఈ బిల్లును పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. పలు నిబంధనలపై వివరణలు కోరడంతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖల సూచనలు పొందుపరిచి కొత్త బిల్లును సమర్పించేలా ప్రస్తుత బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు పాత ఐపీసీ-1860, సీఆర్‌పీసీ-1973 చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత-2023’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత- 2023’ చట్టాలు 01.07.2024 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దిశ బిల్లు ద్వారా సాధించాలనుకున్న మహిళలు, చిన్నారుల రక్షణ లక్ష్యాలను, కఠిన చట్టపరమైన నిబంధనలను ఈ కొత్త కేంద్ర చట్టాలు ఇప్పటికే బలోపేతం చేశాయి. కేంద్ర హోం శాఖ సూచనలు, నూతన క్రిమినల్ చట్టాల అమలు నేపథ్యంలో దిశ బిల్లును ఉపసంహరించుకోవడమే సబబు అని రాష్ట్ర డీజీపీ, న్యాయ శాఖ ఇచ్చిన స్పష్టమైన అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.

ఇంధన శాఖ:
ఆక్వాకల్చర్ ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీని 1.6.2026 నుంచి పొడిగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆక్వా రైతులకు దాదాపు రూ.1,150 కోట్ల మేర విద్యుత్ రాయితీని అందిస్తారు.
పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ ఫెసిలిటేటర్‌గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికీ ఏపీ ట్రాన్స్‌కో`ఏపీ డిస్కమ్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5 శాతానికి తగ్గించేందుకు, అభివృద్ధి ఛార్జీలను మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రెవెన్యూ (భూములు) శాఖ:
కండలేరు రిజర్వాయర్ నుంచి శ్రీసిటీలోని పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం డీఐ నీటి పైప్‌లైన్ నిర్మాణానికి తిరుపతి జిల్లా రిజర్వ్ ఫారెస్టులో 1.76 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించారు. దీనికి ప్రత్యామ్నాయంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో ఎల్‌పీఎం నెం.1570లో ఉన్న 8.70 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు వీలుగా, సాధారణ నిబంధనలకు లోబడి ఏపీఐఐసీ జోనల్ మేనేజరు, నెల్లూరుకు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రెవెన్యూ (భూములు) శాఖ:
పీఎం`కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లి గ్రామంలో 49.67 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన NREDCAP వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం. పీఎం-కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం వైఎస్సార్ కడప జిల్లా వేముల (గ్రామం, మండలం)లో 51.37 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన NREDCAPAP వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో 2.00 ఎకరాల భూమిని జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన టీడీపీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో 19.56 ఎకరాల భూమిని ఎకరానికి రూ.30.00 లక్షల మార్కెట్ విలువ చెల్లింపుపై, ఎస్‌డీఆర్ అందిన అనంతరం సాధారణ షరతులకు లోబడి ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లె గ్రామంలో 2.00 ఎకరాల భూమిని జిల్లా కేంద్రంలో జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన టీడీపీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం (గ్రామం , మండలం) నడిపూడి గ్రామ పంచాయతీలో రెండెకరాల ప్రభుత్వ భూమిని జిల్లా టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన టీడీపీకి ఇచ్చేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.
చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో 13.47 ఎకరాల భూమిని లేఔట్ అభివృద్ధి కోసం సాధారణ నిబంధనలకు లోబడి చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం
నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుంచి శ్రీసిటీలోని పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం డీఐ నీటి పైప్‌లైన్ నిర్మాణానికి నెల్లూరు డివిజన్ రిజర్వ్ ఫారెస్టులో 1.30 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించారు. దీనికి ప్రత్యామ్నాయంగా 6.42 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు వీలుగా, సాధారణ నిబంధనలకు లోబడి జోనల్ మేనేజరు, ఏపీఐఐసీకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ:
నూతనంగా పునర్వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రతిపాదనకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ చట్టం 2016లోని సెక్షన్ 3 ప్రకారం ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు.

పరిశ్రమలు, వాణిజ్య శాఖ:
విజయవాడ జవహర్ ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ హౌసింగ్ కాలనీలో 404 గృహ యూనిట్లకు (MIG-64, LIG–108, EWS–232) అర్హులైన కేటాయింపుదారులు, తదుపరి కొనుగోలుదారులు, వారి చట్టబద్ధ వారసులు, వారసులు/సక్సెసర్లు, ప్రస్తుత యజమానులకు సమాన ప్రాతిపదికన భూమి అవిభాజ్య వాటా, ఉమ్మడి స్థల హక్కులను క్రమబద్ధీకరించడం/కన్వేయన్స్ చేయడం, అర్హత కలిగిన కేటాయింపుదారులు, చట్టబద్ధ వారసులు, సక్సెసర్లు, ప్రస్తుత యజమానుల విషయంలో అవసరమైన ర్యాటిఫికేషన్ డీడ్లను అమలు చేయడానికి ప్రతిపాదనకు ఆమోదం.

ఆమోదిత ప్రాజెక్టు ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా రుణ వాటా కోసం HUDCO మంజూరు చేసిన రూ.680.21 కోట్ల టర్మ్ లోన్‌ను ఏపీ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పొందేందుకు ప్రతిపాదనకు ఆమోదం. G.O.Ms.No.89, I&C  శాఖ 11.12.2024 ద్వారా నోటిఫై చేసిన ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్, అపారెల్, గార్మెంట్స్ పాలసీ (4.0) 2024-29లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకానికి సంబంధించిన క్లాజ్ 5.3(5)ను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

న్యాయ శాఖ:
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంతో పలు చట్టాలను ఏకకాలంలో సవరించే లక్ష్యంతో ప్రతిపాదించిన “ఆంధ్రప్రదేశ్ ఆమ్‌నిబస్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం, 2026” రూపకల్పనకు ఆమోదం.
రాష్ట్రంలో పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడం, వ్యాపారాలకు ఆటంకంగా ఉన్న పాత నిబంధనలను సరళీకృతం చేయడం, అనుమతుల ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఒకే బిల్లు (ఆమ్‌నిబస్) ద్వారా వివిధ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ విధానాలను మరింత పారదర్శకంగా మార్చనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోకి భారీగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసి యువతకు విశేషంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.

రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు, డి-ఫారం పట్టాలు లేకుండా భూములను దీర్ఘకాలంగా సాగు చేస్తూ స్వాధీన అనుభవంలో ఉన్న రైతులు/ సాగుదారులు భూముల అభివృద్ధికి చేసిన గణనీయ పెట్టుబడులు, భూసేకరణ వల్ల వారి జీవనోపాధిపై పడే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని, ఎకరాకు రూ.12.44 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం. ఈ చెల్లింపు భవిష్యత్ క్లెయిమ్‌లకు ఎటువంటి పూర్వనిదర్శనంగా పరిగణించ కుండా… ఒకేసారి, కేసు-ప్రత్యేక చర్యగా అమలు చేయనున్నారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ:
2026-27 ఆర్థిక సంవత్సరానికి రైతులకు యాన్యుటీల చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రూ.300 కోట్ల రుణాన్ని పొందేందుకే ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ తీసుకున్న చర్యను ధ్రువీకరించే ప్రతిపాదనకు ఆమోదం.
అమరావతి క్యాపిటల్ సిటీలో అమరావతి ఐ అభివృద్ధిని PPP-డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు టెండర్‌ను తిరిగి పిలిచేందుకు అనుమతించే ప్రతిపాదనకు ఆమోదం.
సీఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు కొత్త భూ కేటాయింపులు, గతంలో జరిపిన కేటాయింపుల సమీక్షకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలపై జీఓఎం 28వ సమావేశం చేసిన సిఫార్సులను అథారిటీ తీర్మానం సీఆర్డీఏ నెం.690/2026 ద్వారా ఆమోదించిన

ప్రతిపాదనకు ఆమోదం. జీఓఎం ప్రతిపాదనలు….
జీఎసఐ కొత్త అనుమతులు: అనంతవరం సర్వే నం.221(P)లో 1.50 ఎకరాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయం, ల్యాబొరేటరీ, మ్యూజియం కోసం ఎకరాకు రూ.4.1 కోట్ల చొప్పున 30 ఏళ్ల లీజుకు, మరో 0.57 ఎకరాలు అభివృద్ధి, పార్కు నిర్వహణ కోసం లీజుకు ప్రతిపాదించారు.
సీఏజీ అనుమతి సవరణ: ఐనవోలులో గతంలో కేటాయించిన 12 ఎకరాల నుంచి 5 ఎకరాలను ఫ్రీహోల్డ్ పద్ధతిలో స్థల మార్పిడితో స్టాఫ్ క్వార్టర్స్ కోసం కేటాయించేందుకు ప్రతిపాదన.
ఏపీఐఐసీ కన్వెన్షన్ సెంటర్: ఐనవోలులో కేటాయించిన భూమిని 8 ఎకరాల నుంచి 5.09 ఎకరాలకు తగ్గించి, స్థల మార్పిడితో ఏపీసీఆర్డీఏ పరిధిలో కేటాయించేందుకు ప్రతిపాదన.
APIIC–HUDCO జాయింట్ వెంచర్: గతంలో హడ్కోకు కేటాయించిన 9.17 ఎకరాల ఫ్రీహోల్డ్ కేటాయింపును రద్దు చేసి, ఎంఐసీ మౌలిక వసతుల కోసం 10.20 ఎకరాలను సీఆర్డీఏకు పూర్తి హక్కులతో స్థల మార్పిడి ద్వారా కేటాయించేందుకు ప్రతిపాదన.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ:

G.O.వీs.చీశీ.330, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, 11.10.2018 మేరకు రెండో దశ భూ సమీకరణ పథకం కింద పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామంలోని దేవదాయ ఇనాం భూములకు సంబంధించిన పరస్పర వివాద దావాలను పరిష్కరించేందుకు దేవదాయ శాఖకు రూ.122.20 కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా T1, T2 ట్విన్ ఆఫీస్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఎడ్జ్ అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా షెల్`కోర్ నిర్మాణ పనులను డిజైన్ అండ్ బిల్డ్ లంప్‌సమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టేందుకు ఎల1 బిడ్డర్‌ను ఖరారు చేసే ప్రక్రియను నిర్వహించడానికి AGI్పుL మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పించే

ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
హైకోర్టు భవనం నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల విస్తరించిన కన్సల్టెన్సీ సేవల పరిధికి, తదనుగుణంగా పెరిగిన కన్సల్టెన్సీ ఫీజుకు, అలాగే శాసనసభ, హైకోర్టు భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్లను నియమించేందుకు, వారికి సంబంధించిన అదనపు కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపునకు జీఎస్టీతో కలిపి రూ.206.59 కోట్లు మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.

శాసనసభ-హైకోర్టు భవనాల కన్సల్టెన్సీ: APCRDA, Hafeez Contractor, Foster + Partners (UK), Foster + Partners India కన్సార్టియంను 10.07.2025న నియమించింది. హైకోర్టు కోర్టు హాళ్లు 40 నుంచి 52కు పెరగడంతో 87,543.36 చ.అ. అదనపు బిల్ట్-అప్ ఏరియా, కన్సల్టెన్సీ పరిధి, నిపుణుల వనరులు పెరిగాయి. వేగవంతమైన నిర్మాణ షెడ్యూల్‌కు అదనపు వనరులు వినియోగించాల్సి రావడంతో పాటు, GదీP మారకపు రేటు 109 నుంచి 128.215కు పెరగడం వల్ల 1,910,177 చెల్లింపులకు అదనపు బడ్జెట్ అవసరం ఏర్పడింది.

ఆర్థిక శాఖ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం`2026 ముసాయిదా బిల్లును ఆమోదించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంగా రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో ఉండగా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1,500 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో పాటు ప్రారంభ దశలో లాభదాయకంగా లేకపోయినా భవిష్యత్తులో ఆదాయం వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేకమైన ‘బ్రిడ్జ్ ఫండ’ను కూడా ఈ పాలసీలో పొందుపరిచారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే పారదర్శక విధానాల ద్వారా భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వర అమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ, ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం.

ఉన్నత విద్యా శాఖ:
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల (స్థాపన, నియంత్రణ) చట్టం, 2016 (2016 నాటి చట్టం నం.3)లోని షెడ్యూల్‌కు సవరణలు చేసి, “ఆర్‌వీఎస్ యÖనివర్సిటీ”, “ప్రగతి యూనివర్సిటీ” పేర్లను చేర్చడంతో పాటు సంబంధిత స్పాన్సరింగ్ బాడీలకు బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ రెండు ప్రైవేట్ యూనివర్సిటీలను స్థాపించేందుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం.

పాఠశాల విద్యా శాఖ:
నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) పోస్టులను సృష్టించడంతో పాటు మొత్తం పోస్టుల్లో 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి, రాబోయే గ్రూప్`1 నోటిఫికేషన్‌లో 14 ఖాళీలను చేర్చి భర్తీ చేసేందుకు అవసరమైన ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్`1998లో తగిన సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుల్లో 50 శాతం పోస్టులను రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో జాబ్ క్యాలెండర్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు.

జలవనరుల శాఖ:
రాబోయే గోదావరి పుష్కరాలు-2027 దృష్ట్యా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో 238 “స్నాన ఘట్టాల పనులు, ఇతర పనుల కోసం రూ.210.06 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.

ఐ.టి.ఇ & సి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టవర్లు, అనుబంధ టెలికాం మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె రుసుము లేకుండా అందించడంతో పాటు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా కల్పించేందుకు ప్రతిపాదనకు ఆమోదం.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ:
గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలోని మొత్తం 2344.12 ఎకరాల భూమిలో అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ (ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మొత్తం 100 మీటర్ల బఫర్ జోన్‌తో) నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చేపట్టేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతినిచ్చే

ప్రతిపాదనకు రాష్ట్ర ఆమోదం.
రైల్వే మంత్రిత్వ శాఖ రూ.2,047.40 కోట్ల అంచనా వ్యయంతో 56.53 కి.మీ. మేర ఈ కొత్త రైల్వే లైన్‌ను ప్రతిపాదించింది. అయితే భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలో తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు మోతడక గ్రామ సభ తీర్మానించడం విశేషం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాజధాని అమరావతికి నేరుగా రైలు, రోడ్డు అనుసంధానం ఏర్పడి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ, విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధికి, శాటిలైట్ టౌన్ల అభివృద్ధికి ఇది విశేషంగా దోహదపడుతుంది. ఈ పథకం కింద స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, యాన్యుటీ, ఒకేసారి వ్యవసాయ రుణ మాఫీ, పెన్షన్లు తదితర ప్రయోజనాలు ఎల్‌పీఎస్ నిబంధనల ప్రకారం అందనున్నాయి.

జలవనరుల శాఖ:
శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో “హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్`2” కింద 400.500 కి.మీ నుంచి 485.300 కి.మీ వరకు ఉన్న ప్రధాన కాలువకు సంబంధించిన మిగిలిపోయిన పనులకు (5 పనులు) రూ.600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మీడియా సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకుడు కేఎస్ విశ్వనాథన్ పాల్గొన్నారు.

Previous Post

చేనేతకు చేయూత

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026

కార్యకర్త
@ August 7, 2026
చేనేతకు చేయూత
ఆంధ్రప్రదేశ్

చేనేతకు చేయూత

చైతన్యరధం
@ August 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

కార్యకర్త
@ August 6, 2026
వైఫల్యాలను చూసి భయపడొద్దు
ఆంధ్రప్రదేశ్

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ
ఆంధ్రప్రదేశ్

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి

చైతన్యరధం
@ August 6, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం

రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం

చైతన్యరధం
@ August 7, 2026
చేనేతకు చేయూత

చేనేతకు చేయూత

చైతన్యరధం
@ August 7, 2026
ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం

రాష్ట్ర పురోగతి, రాజధాని వికాసం

చైతన్యరధం
@ August 7, 2026
చేనేతకు చేయూత

చేనేతకు చేయూత

చైతన్యరధం
@ August 7, 2026
వైఫల్యాలను చూసి భయపడొద్దు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist