- దుగరాజపట్నం షిప్ బిల్డింగ్లో పెట్టుబడులు పెట్టండి
- మారిటైమ్ బోర్డుతో పనిచేసేందుకు ముందుకు రండి
- కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్
- రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
బుసాన్ (సౌత్ కొరియా): భారత తూర్పుతీరంలో 1053 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం కలిగి మారిటైమ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబ డులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఒక మేజర్, 5 నాన్ మేజర్ ఆపరేషనల్ పోర్టుల ద్వారా రాష్ట్రంలో ప్రతిఏటా 330 మిలియన్ టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని వివరించారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుసాన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో మరో నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని, 1.10 లక్షల ఎకరాలకు పైగా ఇండస్ట్రి యల్ ల్యాండ్ బ్యాంక్ ఏపీలో అందుబాటులో ఉందని వివరించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు/షిప్ యార్డ్/ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
భారత్లో మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో 3,488 ఎకరాల్లో నిర్మితమవుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్ శ్రీసిటీ, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉండటంతో పాటు కనెక్టివిటీ కలిగి ఉందని తెలిపారు. భారతీయ ఎగుమతి మార్కెట్ల కోసం కొరి యన్ పరికరాల స్థానికీకరణకు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపా యాలు, ఉమ్మడి సౌకర్యాల ఏర్పాటుకు కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (కేవోఎంఈఏ) ప్రతినిధులను ఆహ్వానించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో టెస్టింగ్/సర్టిఫికేషన్ ల్యాబ్లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్ ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు.
నౌకా నిర్మాణాలకు ఆర్థిక సహకారం
భారతదేశంలో సుమారు US$12.3 బిలియన్ల నౌకా నిర్మాణ ఆర్డర్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటికీ 93 శాతం అంతర్జాతీయ సరుకు రవాణా విదేశీ నౌకల ద్వారానే జరుగుతోంది. తీరప్రాంత నౌకలలో 50 శాతం 20 ఏళ్లకు పైబడినవి, ఎంవో పీఎన్జీ పరిధిలోని 112 నౌకలు, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్తో నౌకల మరమ్మతులకు డిమాండ్ ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం రూ.70 వేల కోట్ల మారిటైమ్ ప్యాకేజీ ప్రకటిం చింది. ఇందులో భాగంగా ఒక్కొక్క నౌకా నిర్మాణానికి 15 నుంచి 25 శాతం ఆర్థికసాయం అందుతోందని వివరించారు. రూ.25 వేల కోట్ల మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొత్త యార్డులకు మూలధన వ్యయంలో 25 శాతం వరకు గ్రాంట్ల రూపంలో అందుతోంది. నౌకా నిర్మాణానికి మౌలిక సదుపాయాల హోదా లభిస్తోందని వివరించారు.
మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను చేతల్లో అమలు చేసి చూపిస్తున్నాం. కియా (US$2 బిలియ న్లు, సుమారు 24 నెలల్లో ట్రయల్ ప్రొడక్షన్), ఎన్జీ ఎలక్ట్రానిక్స్ (శ్రీసిటీ, ఒక సంవత్సరంలోపే శంకుస్థాపన), ఏఎం/ఎన్ఎస్ (US$15.3 బిలియన్లు, 17 నెలల్లో శంకుస్థాపన) ప్రాజెక్టులు ఇందుకు నిదర్శ నం. కొరియన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో పనిచేస్తున్నాయి, చెన్నై రీజియన్లో మరో 50 కంపెనీల వరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్ ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, ఆర్ అండ్ డీ సంస్థల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాన్లా ఐఎంస్, హ్యుందయ్ వెల్డింగ్, డేసన్ షిప్ యార్డు, సన్ బో ఇండస్ట్రీస్, ఓరియంటల్ ప్రెసిషన్ అండ్ ఇంజనీరింగ్, ఫైన్ కొరియా, జేవో ఇంజనీరింగ్ తదితర సంస్థల ప్రతినిధులు















