అమరావతి (చైతన్యరథం): 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలం దరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సినిమా కీర్తిని మరింత పెంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృంద సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. కళ, సంస్కృతి, సినిమా మన గుర్తింపునకు, వారసత్వానికి బలమైన స్తంభాలని వ్యాఖ్యా నించారు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరో హిస్తూ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. అవార్డు గ్రహీతలందరికీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు, మరెన్నో ప్రశంసలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు. 72వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. నేషనల్ ఫిలిమ్స్ 9 అవార్డులతో టాలీవుడ్ సత్తా చూపించడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
















