- ఏపీ టూరిజం శాఖ ఏఐ సేవలు
- ఎక్స్ ప్లర్జర్ ట్రావెల్ సంస్థతో ఒప్పందం
- మంగళగిరి నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): ఏపీ పర్యాటక శాఖ ఆలయాల చరిత్రను పర్యాటకులు సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ఏఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన వారు సమాచార బోర్డులు, బ్రోచర్లు చదవడం, గైడ్ల ద్వారా అక్కడి ప్రత్యేకతలు తెలుసుకునే వారు. దీంతో భాష తెలియని వారు, విదేశీ పర్యాటకులు ఇబ్బంది పడుతుండేవారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘నీవు ఏఐ న్యూరల్ ఇంటెలిజెన్స్ వెర్నాక్యులర్ యూనిఫైడ్ మోడల్ ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. పర్యాటకుడి అనుభవాన్ని పూర్తిగా మార్చే దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ, ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఎక్స్ పర్జర్ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో సేవలు రాష్ట్రంలో 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్ను మొబైల్లో స్కాన్ చేస్తే ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే సేవలు ప్రారంభమవుతాయి. సందర్శకుడు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో సమాధానం వస్తుంది. మొత్తం 113 భాషల్లో సమాచారం తెలుసుకోవచ్చు. ఆలయాలైతే వాటి స్థల పురాణం, దారిత్రక నేపథ్యం, దర్శన సమయాలు, సమీప దేవాల యాల వివరాలు చెబుతుంది.
కోటలు, బీట్లు, ప్రకృతి ప్రాంతాలైతే వాటి చరిత్రతో పాటు సమీపంలోని ఇతర సందర్శనీయ ప్రాంతా లు, ఒకటి, రెండురోజుల పర్యటన ప్రణాళికలు కూడా సూచిస్తుంది. ఈ సేవలో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రతిఒక్కరికీ ఒకే సమాచారం చెప్పదు. చిన్నారులకు సులభంగా, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి విస్తృతంగా, ఆధ్యాత్మిక యాత్రికులకు ప్రత్యేకంగా, విదేశీ పర్యాటకులకు వారి భాషలో సమాచారం అందిస్తుంది. ప్రయోజనాలు గైడ్ కోసం వెతుక్కోవలసిన అవసరం ఉండదు. భాష తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొబైల్లోనే పూర్తి సమాచారం లభిస్తుంది. సమీపంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు తెలుస్తాయి. వ్యక్తిగత ఆసక్తికి అనుగుణంగా సూచనలు ఇస్తుంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వెబ్సైట్ను కూడా ప్రభుత్వం ఆధునికీకరిం చింది. పర్యాటకులకు అవసరమైన సమగ్ర సమాచారం అందుబాటులో పెట్టారు. పర్యాటక ప్రాంతాలు, ప్యాకేజీల వివరాలు, వసతి కల్పన, ఇతరత్రా వివరాలు టూరిజం ఏపీ జీవోవీ ఇన్ వెబ్సైట్ ద్వారా పర్యాటకులు తెలుసుకోవచ్చు.















