- 2014-19 మధ్య చంద్రబాబు ప్రత్యేక చొరవతో కాలువ విస్తరణ పనులు వేగంగా సాగాయి
- 2019 నాటికే దాదాపు 35 శాతం పనులు పూర్తి
- తర్వాత జగన్రెడ్డి ప్రాజెక్టును నిలిపివేసి దెబ్బతీశారు
- కాలువను విస్తరిస్తామని నమ్మబలికి మోసగించాడు
- కూటమి వచ్చాక రెండేళ్లలోనే కాలువ విస్తరణ పనులు
- యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు మేలు చేశాం
- గత ఏడాది రికార్డు స్థాయిలో 60 టీఎంసీలకు పైగా
- నీటిని తీసుకురావడం ప్రభుత్వం సాధించిన విజయం
- ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ
ఉరవకొండ(చైతన్యరథం): ప్రజాభిమానం కోల్పోయిన వైసీపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతూ హంద్రీనీవా
పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఉరవకొండ
పట్టణం సమీపంలో హంద్రీనీవా కాలువ పనులను ఆదివారం వారు పరిశీలించారు. అనంతరం వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ఎండగట్టారు. ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు హంద్రీనీవా కాలువ పరిశీలన పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు వేగంగా సాగాయన్నారు. 2019 నాటికే దాదాపు 35 శాతం పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం వాటిని అర్ధాంతరంగా నిలిపివేసి ప్రాజెక్టు పురోగతిని పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. జగన్రెడ్డి తన పాలనలో హంద్రీనీవాకు రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కాలువను 6,000 క్యూసెక్కులకు విస్తరిస్తామని, సమాం తరంగా మరో కాలువ నిర్మిస్తామని నమ్మబలికి అధికారంలో ఉన్నన్ని రోజులు విస్తరణ ఊసేత్తకుండా జిల్లా ప్రజానీకాన్ని నిలువునా మోసగించినప్పుడు నాడు జగన్రెడ్డిని వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. విస్తరణ పనులను నిలిపివేసి తట్టెడు మట్టి కూడా ఎత్తని వైసీపీ నాయకు లకు హంద్రీనీవా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యా నించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయగలిగామని తెలిపారు.
అనంతపురం జిల్లా రైతులు, ప్రజలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధికి హంద్రీనీవా పనులే నిదర్శనమని పేర్కొన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 60 టీఎంసీలకు పైగా నీటిని తీసుకురావడం ప్రభుత్వం సాధించిన ఘన విజయమని స్పష్టం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని ఇటీవల నెల్లూరులో జరిగిన వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వయాన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ప్రస్తావించిన, ప్రస్తుతించిన విషయాన్ని గుర్తు చేశా రు. సొంత పార్టీ అంతర్గత సమావేశాల్లో వాస్తవాలు మాట్లాడు తూనే.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జిల్లా వైసీపీ నాయకు లు హంద్రీనీవా పరిశీలన పేరుతో సరికొత్త డ్రామాలకు తెర లేపా రని దుయ్యబట్టారు.















