ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు.
సమాజానికి విశిష్ట సేవలందించిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఒంగోలులోని KIMS హాస్పిటల్ ఫ్లై ఓవర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే ఒంగోలు గిత్త విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ రావు, ఉగ్ర నరిసింహారెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.