ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్రవారం ఒంగోలులో జరిగింది.
జగన్ కు పదోసారి సారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్ ఫిక్స్ చెయ్, పులివెందులకి అయినా, తాడేపల్లికి కొంపకు అయినా వస్తా, చర్చకు మీరు సిద్ధమా, డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు నాకు నీతులు చెబుతారా అని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశం శుక్రవారం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.