అమరావతి (చైతన్యరథం): ‘మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే మీరు ఆయురారోగ్యాలతో నిండు సూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ధి కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు మీరు తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ పవన్కల్యాణికి సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు.















