- గురువులపై దాడి బాధ్యులను ఉపేక్షించేది లేదు
- డీఎస్సీపై దుష్ప్రచారంతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర
- చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగ భరోసా
- లోకేష్ చొరవతో విద్యారంగంలో సంస్కరణలు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి(చైతన్యరథం): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డా రు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు చేస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ చేపట్టిన ఆందో ళన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయులు అంటే గౌరవం లేని గొడ్డలి పార్టీ నేతలు.. వారిని అవమానించడమే కాకుండా దాడులకు దిగడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. క్రీడల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించి కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిపై అనుమానాలు రేకెత్తించ డం సరికాదన్నారు. తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, పతకాలు నిజమైనవేనని స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు వెల్లడించిన నేపథ్యం లోనూ రాజకీయ రాద్ధాంతం చేయడం దేనికని ప్రశ్నించారు.
గురువులను గౌరవించడం మన సంస్కారం
ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని పల్లా అన్నారు. ఒక ఉపాధ్యాయుడి వెనుక ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, చదువు, పోటీ, కుటుంబం ఆశలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గదర్శకులుగా గురువులు నిలుస్తారని చెప్పారు. అలాంటి ఉపాధ్యాయులను రోడ్లపైకి లాగి అవమానించడం, దాడులకు పాల్పడటం వైసీపీ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు.
డీఎస్సీపై బురదజల్లడమే జగన్‌రెడ్డి లక్ష్యం
డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పటికే రాజకీయ రాద్ధాంతంగా మారాయి..జగన్‌రెడ్డికి విద్యారంగంపై, ఉపాధ్యాయులపై గౌరవం లేదని మండిపడ్డారు. కరోనా సమ యంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన తీరు వారిపై గత ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి యువతకు ఉద్యోగ భరోసా కల్పించిన ఘనత చంద్రబా బు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. డీఎస్సీ పై ఆరోపణలు ఉంటే ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, రాజకీయ ముసుగులో ఉపాధ్యాయులను అవమానించడం తగదని హితవుపలికారు.
చంద్రబాబు నాయకత్వంలో విద్యారంగానికి కొత్త దిశ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పల్లా అన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో పలు సంస్కర ణలు చేపడుతుందన్నారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గురువులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటన లను ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను కించపరిచే రాజకీయాలు మానుకోవాలని జగన్‌రెడ్డికి హితవు పలికారు. గొడ్డలి పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూటమి ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో చేపడుతున్న సంస్కరణలు, యువతకు కల్పిస్తున్న అవకాశాలను అడ్డుకోలేదని తేల్చిచెప్పారు.














