- ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి
- పిఠాపురం ప్రజల నమ్మకాన్ని అభివృద్ధిగా తిరిగి ఇస్తున్నాం
- దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- రూ.1,500 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు,
- శంకుస్థాపన సభలో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
పిఠాపురం(చైతన్యరథం): మన కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక. .అందుకోసం ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకుండా అందరం కలిసి పనిచేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పిలుపుని చ్చారు. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలబడటం నా స్వభా వం, నా గుణం..ఈ విలువలను ఈ నేల నేర్పింది..ప్రజల అభివృద్ధే మన ప్రధాన లక్ష్యం.. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి వాటిని తీర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దామని పేర్కొన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నా క్యాంపు ఆఫీసును పిఠాపురంలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పం.. ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తాజాగా మరో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంగళవారం పిఠాపురంలో రూ.1,500 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆరఆర్‌బీహెచఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని కళ్లముందు చూస్తున్నాం. వివిధ రంగాల్లో ఎన్నో కోట్ల రూపా యలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.















