అమరావతి (చైతన్యరథం): “మన ఆడబిడ్డల ఆదరణతో, మాతృమూర్తుల ఆమోదంతో ‘స్త్రీ’ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరు కుంది. గతఏడాది అగస్టు 15వ తేదీన ప్రారంభమైన ‘స్త్రీ శక్తి’ 100కోట్లకు పైగా ఉచిత ప్రయా ణాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నా రంటే ఈ పథకం రాష్ట్ర మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయినట్టు అర్థమవుతోంది. చదువు కునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడ బిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చింది. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసా అందిస్తోంది. ఇప్పటికి ఈ పథకం ద్వారా మహిళలు రూ.3,550 కోట్ల మేర ఆదా చేసుకున్నారు. ఇలా ఆదా అయిన ప్రతి రూపాయి వారి పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్తుకు ఉపయోగపడాలన్నదే మా ఆకాంక్ష. ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళలందరికీ కృతజ్ఞతలు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బంది ఎంతో కృషి చేశారు.” అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమం వేదికగా అందరికీ అభినందనలు తెలిపారు.
















