అమరావతి (చైతన్యరథం): కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును దర్గా పెద్దలు ఆహ్వానించారు. అమీన్ పీర్ మీన్ పీర్ దర్గా పీఠాధిపతి కేఎసఎస్ అరీఫుల్లా హుస్సేనీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు హాజరవ్వాలని కోరారు. ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. చంద్రబాబును కలిసిన వారిలో దర్గా మేనేజరు ఎండీ అలీఖాన్, సయ్యద్ గౌస్, అమీర్ బాషా తదితరులు ఉన్నారు.















