విజయవాడ (రైతన్య రథం) ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రం విజయవాడలో. ప్రారంభమయ్యాయి. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. వీటిని ప్రారంభించారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ప్రారంభమైన మరుసటి ఏడాది నుంచే ప్రజలకు వైద్యారోగ్య సేవలను అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని… నియోజకవర్గాల్లో పేదలకు వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య రథాలతో మొబైల్ క్లినిక్స్ నిర్వహిస్తోంది. ట్రస్ట్ ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలలో బ్లడ్ సెంటర్లు నడుపుతోంది. తాజాగా విజయవాడలోనూ రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించడంతో వీటి సంఖ్య ఐదుకు చేరింది. తలసేమియా లోపమున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించే కార్యక్రమాన్ని ట్రస్ట్ గత ఏడాదే. ప్రారంభించింది. ఇప్పుడు విజయవాడలోనూ తలసేమియా కేర్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చారు.. అవసరమైనచోట్ల రాష్ట్రవ్యాప్తంగా తలసేమియా కేర్ సెంటర్లు, రక్తనిధి కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని భువనేశ్వరి ఇటీవల ప్రకటించారు. రోగులకు సకాలంలో చికిత్స, ప్రాణాధారమైన రక్తం సులభంగా అందేలా చూడటమే దీని ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.















