చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

పంటల బీమానే రైతులకు శ్రీరామరక్ష అన్న సీఎం

by చైతన్యరధం
November 7, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
  • గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  • పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన
  • జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు కాలినడకన వెళ్లి బాధిత రైతులతో మాట్లాడిన సీఎం
  • పట్టిసీమ వరమిచ్చినా ప్రకృతి కరుణించలేదని రైతుల ఆవేదన
  • పంటల బీమానే రైతులకు శ్రీరామరక్ష అన్న సీఎం

గుంటూరు/బాపట్ల (చైతన్యరథం): మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను, వరద నీటిలో మునిగిన పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు నడుచుకుంటూ వెళ్లి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి రేటూరు గ్రామం వరకు కాలినడకన సాగిన సీఎం దారిపొడవునా రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. మధ్యమధ్యలో పొలాల వద్ద ఆగుతూ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట కాలువ గట్లు, పంట బోదెలపై నడుచుకుంటూ వెళ్లి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు, పంట దిగుబడి అంచనాలు, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ప్రవాహ ఉధృతిని పరిశీలించిన ముఖ్యమంత్రికి వాగు ఉధృతి కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగిన తీరును రైతులు, అధికారులు వివరించారు. జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వెళ్లే మార్గంలో పలుచోట్ల కోతకు గురైన రహదారిని పరిశీలించారు. నల్లమడ వాగు గేట్లు దెబ్బతిన్నాయని, వాటి కారణంగా నీటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైతే కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లమడ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరకుండా నియంత్రించడంతో పాటు వరద వచ్చినప్పుడు వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రైతులు పడిన కష్టానికి ఫలితం దక్కేలా పని చేస్తున్నాం
రేటూరు గ్రామంలో నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి… వరద నీటిలో మునిగిపోయిన వరి చేలను పరిశీలించారు. పొలం గట్లపై నడుస్తూనే రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా సాగునీరు అందడంతో పంటలు సాగు చేశామని, మంచి దిగుబడి వస్తుందని ఆశించిన సమయంలో తుఫాను వచ్చి తీవ్రంగా నష్టపరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం ఎంత పెట్టుబడి పెట్టారు? పంటల బీమా చేయించుకున్నారా? అనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంటల బీమా, ప్రభుత్వ ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అండగా నిలుస్తాయని వివరించారు. పంటల బీమాపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. తుఫాన్ల ముప్పు తగ్గేలా సాధారణ సాగు సీజను కంటే ముందుగానే నీరు అందించి పంటలు వేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముందస్తు సాగుకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రేటూరులో రైతులు, ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్`నినో ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పట్టిసీమ ద్వారా సాగునీరు అందించడంతో పంటలు సాగు చేశారని, మంచి దిగుబడులు వచ్చే సమయంలో మురసు తుఫాను నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముందస్తు చర్యలతో నష్ట నివారణ… వేగంగా పునరుద్ధరణ
తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేస్తున్నామని, చివరి బాధితుడికి సాయం అందేవరకు ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు నష్టపోయిన పెట్టుబడిలో కొంత మేర ఉపశమనం కలుగుతుందని చెప్పారు. రైతుల పంట నష్టం అంచనాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని… రైతులకు ఫోన్ల ద్వారా సమాచారం అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సంఘాల ప్రతినిధులతోనూ మాట్లాడి కాలువలు, తూముల్లో పేరుకుపోయిన కంప, ఇతర అడ్డంకులను తొలగిస్తున్నారా అని ఆరా తీశారు.

నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ కారణంగా నేలకొరిగిన 30వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, మురసు తుఫాను వల్ల మరో 10వేల స్తంభాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను కూడా త్వరితగతిన పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. తుఫాను సహాయ చర్యల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. తుఫాన్ల ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించామని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

ఓ పక్క తుఫాన్లు… మరోపక్క ఎల్`నినో
రాష్ట్రంలోని తీర ప్రాంతాలను వరుస తుఫాన్లు ఇబ్బందులకు గురిచేస్తుంటే, రాయలసీమ ప్రాంతం ఎల్`నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాయలసీమలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలు కూడా పర్యటించాయని తెలిపారు. ఒకవైపు తీర ప్రాంతాల్లో నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే, మరోవైపు రాయలసీమలో నీటి కొరత నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు నీటి భద్రత, సమర్థ నీటి నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వరద నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చినప్పుడు రెడ్‌కార్పెట్ వేసుకుని పంటలను పరిశీలించి పరామర్శించేవారన్నారు.

తాము స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి తుఫాను సమయంలో సహాయక చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రెండు తుఫాన్లు వచ్చాయని… అయినా ఎన్నికలపై దృష్టి పెట్టకుండా… ప్రజలకు ఇబ్బందులు పరిష్కరించేందుకే ప్రాధాన్యత ఇచ్చామని… నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కొందరు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని, పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై మాట్లాడతానని చెప్పారు. అంతకుముందు జిల్లెళ్లమూడి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రిని అమ్మ భక్తులు కలిశారు. వారు గ్రామంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు. అమరావతి నుంచి ఏరియల్ సర్వే చేసుకుంటూ సీఎం చంద్రబాబు సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. పర్యటనలో మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, వేగేశ్న నరేంద్రవర్మ, ఏలూరి సాంబశివరావు, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

ప్రతి అడుగులోనూ భరోసా!

Next Post

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
జగన్ హయాంలో పల్లెలు సర్వనాశనం
ఆంధ్రప్రదేశ్

జగన్ హయాంలో పల్లెలు సర్వనాశనం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

November 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-11-2026

November 6, 2026
Next Post
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

జగన్ హయాంలో పల్లెలు సర్వనాశనం

జగన్ హయాంలో పల్లెలు సర్వనాశనం

by చైతన్యరధం
November 7, 2026

రూ.వేల కోట్ల కేంద్ర నిధులను దారిమళ్లించి పప్పుబెల్లాల్లా వాడేశారు పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకూ పైసలు లేకుండా చేసిన పాపం గొడ్డలిపార్టీదే సెంటు స్థలాల పేరుతో రూ.7...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.