విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ‘రెన్యూ’ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా తన ప్రతినిధుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రెన్యూ సంస్థ చేపడుతున్న విండ్, సోలార్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణపై ముఖ్యమంత్రితో సుమంత్ సిన్హా విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఉన్న విస్తృత అవకాశాలు, నూతన పెట్టుబడులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై సీఎం స్పందిస్తూ… పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని వారికి స్పష్టం చేశారు.




















