విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సాగర తీర నగరం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 12, 13 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భాగస్వామ్య సదస్సు జరగనుంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ప్రతినిధులకు ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాదర స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఉత్సవ వాతావరణంలో సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన
విదేశీ, స్వదేశీ అతిథులను ఆకట్టుకునేలా గిరిజన థింసా నృత్యం, గరగ నృత్యాలు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తోలుబొమ్మలాట, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రాముఖ్యత, ఆతిథ్యం, రుచులు, నూతన రాజధాని అమరావతి వైభవం, కడియం నర్సరీల ప్రత్యేకతలను ప్రతిబింబించే రీతిలో ప్రాంగణమంతా మనోహరమైన కళాకృతులను తీర్చిదిద్దారు.
పెట్టుబడులు, వనరుల ప్రదర్శన కోసం ప్రత్యేక స్టాళ్లు
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, పారిశ్రామిక అవకాశాలను వివరించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ, టూరిజం, లాజిస్టిక్స్, సౌర విద్యుత్ (సోలార్) వంటి కీలక రౌండ్లలో ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పేలా నమూనాలు, కళాకృతులను తీర్చిదిద్దారు.
బిజినెస్ చర్చల కోసం అంతర్జాతీయ స్థాయి వేదికలు
పరిశ్రమల స్థాపన, ఒప్పందాల కోసం విచ్చేసే పారిశ్రామికవేత్తల సౌకర్యార్థం సదస్సు ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశ మందిరం: దిగ్గజ కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నేరుగా సమావేశమై చర్చలు జరిపేందుకు ప్రత్యేక హాలును సిద్ధం చేశారు.
దీ2దీ & G2దీ వేదికలు: బిజినెస్-టు-బిజినెస్ (దీ2దీ), గవర్నమెంట్-టు-బిజినెస్ (G2దీ) చర్చలతో పాటు నూతన ఒప్పందాలు (వీశీUs) కుదుర్చుకోవడానికి వేర్వేరుగా విభాగాలను కేటాయించారు.
బహుళ సమావేశ మందిరాలు: ఒకేసారి రెండు, మూడు కార్యక్రమాలు, మేధోమథన సదస్సులు నిర్వహించుకునేలా ప్రధాన ప్లీనరీ హాలుతో పాటు ఆరు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు.




















