- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
- ఒంటరి మహిళ వెంకాయమ్మకు ప్రభుత్వ ఇల్లు
- కుమారుడు వంశీకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం
- టీడీపీ కార్యాలయంలో సంబంధిత పత్రాల అందజేత
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో కొలువుదీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 45 రోజుల క్రితం తన సమస్యలను వివరిస్తూ వినతిపత్రం ఇచ్చింది. ఒంటరి మహిళగా ఇబ్బందులు పడుతున్నాను..కుమారుడికి సరైన జీవనోపాధి లేదు. నాకు కిడ్నీల సమస్య ఉంది..ప్రతి మూడు నెలలకు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి.. సరైన ఇల్లు కూడా లేదని వివరించింది. వెంకాయమ్మ సమస్యలు విన్న ముఖ్యమంత్రికి కళ్లు చెమర్చాయి. వెంటనే ఆమెకు తగిన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో రూ.1.80 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తూ…ఆమె కుమారుడు వంశీకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం కల్పిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చెప్పడానికి వెంకాయమ్మ కుటుంబానికి చేసిన సాయమే ఓ నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే ప్రభుత్వమన్నారు. అరాచకం, అవినీతికి ఈ పాలనలో చోటు లేదన్నారు. పేదలకు అండగా నిలవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లక్ష్యమన్నారు. వైసీపీ పాలన ప్రజా కంటక పాలన లా సాగింది..అందుకే ప్రజల ఛీత్కారానికి గురై తరిమి కొట్టబడిరదన్నారు. అనంతరం వెం కాయమ్మకు, వంశీకి ఇల్లు మంజూరు, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, నాయకులు ఎస్పీ సాహెబ్, విద్యాసాగర్ పాల్గొన్నారు.