- దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పెట్టుబడి రాయితీలో సేవలు
- వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం రూ.381.75 కోట్ల అంచనా
- వరి రైతుకు ముఖ్యమంత్రి రూ.10 వేల ప్రకటనతో అదనపు సాయం
- పంట దిగుబడి సమయంలో బీమాతో అన్నదాతకు మరింత తోడ్పాటు
- నూతన విధానంపై వ్యవసాయాధికారులతో మంత్రి అచ్చెన్న టెలీ కాన్ఫరెన్స్
విజయవాడ(చైతన్యరథం): ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు ప్రహసనంగా మారుతున్నాయని, పంట నష్టపరిహారం కింద పెట్టుబడి రాయితీ అందించే విధానంలో డిజిటల్ అప్లికేషన్ రూపొందించామని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దేశంలోనే తొలిసారి మరెక్కడా లేని విధంగా పెట్టుబడి సాయం పారదర్శకంగా అందించేందుకు నూతన డిజిటల్ విధానంలో యాప్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఇటీవల సంభవించిన వరదలు, భారీ వర్షా లు, కలిగిన నష్టాలు, డిజిటల్ విధానంలో రూపొందించిన వెబ్ అప్లికేషన్‌పై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ కమిషనర్ ఢల్లీిరావు, ఉద్యానశాఖ కమిష నర్ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారులతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు పంట దిగుబడి వచ్చే సమయంలో విపత్తుల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బీమా చెల్లిస్తామని, ప్రస్తుతం నష్టపోయిన రైతులకు అందించే ప్రభుత్వ సాయంతో పాటు దిగుబడి సమయంలో ఇచ్చే బీమా రైతులకు తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఢీల్లీరావు సంభ వించిన పంట నష్టం వివరాల రియల్ టైమ్ నమోదు ప్రక్రియ, యాప్ సేవలను మంత్రికి వివరించారు. ఇప్పుడు రూపొం దించిన యాప్ ద్వారా పారదర్శకంగా డేటా నమోదు జరుగుతుందని, భవిష్యత్తులో ఉపయో గపడే విధంగా పూర్తిస్థాయి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ 2.06 లక్షల హెక్టార్లలో, ఉద్యాన శాఖ 19,735 హెక్టార్ల లో పంట నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా సిద్ధం చేసినట్టు తెలిపారు. మొత్తం పంటల నష్టం రూ.381.75 కోట్లుగా అంచనా వేసినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.8 లక్షల మంది రైతులు వర్షాలు, వరదల కారణంగా నష్టపోయినట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.390.12 కోట్ల అంచనా సిద్ధం చేశామని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో యాప్‌లో వివరాల నమోదుతో తక్షణ సాయం అందడంతో పాటు రైతులకు శాస్త్రవేత్తల సూచనలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రైతులకు విపత్తుల సమయంలో జరిగే నష్టం వెలకట్టలేనిదని, పెట్టుబడి రాయితీ కింద అందించే సాయం ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం సూచనలతో యాప్ రూపొందించినట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులకు వాటిల్లిన నష్టం అధికారులు యాప్‌లో నమోదు చేయడం, అనంతరం ఆయా గ్రామాలలో సామాజిక తనిఖీ నిర్వహించడం ద్వారా పారదర్శకంగా నష్ట పరిహారం చెల్లింపులు జరుగుతాయని వెల్లడిర చారు. సీఎం చంద్రబాబు వరి సాగు చేస్తూ నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం అందిస్తామన్న నిర్ణయంతో మరికొంత సాయం చేకూరుతుందని చెప్పారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వ సాయం అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.
బీమాతో అదనపు రక్షణ
రైతులకు ప్రకృతి విపత్తుల కారణంగా ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీతో పాటు పంట దిగుబడి వచ్చే సమయంలో బీమా కంపెనీలు చెల్లించే బీమా సొమ్ము రైతులకు అదనపు రక్షణగా మారుతుందని, పంటల బీమా పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.