2014 అక్టోబర్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయింది. రాష్ట్ర ఖజానాను జగన్ దివాళా తీయించినా.. నాలుగు నెలల్లోనే 120కి పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని అమలు చేసిన మంచి ప్రభుత్వం ఇది. పింఛను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలుగా 1వ తేదినే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించింది. పంచాయతీలకు రూ.1,452 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.300 కోట్లు నిధులు సమకూర్చింది. ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు విడుదల చేసింది. ఆరోగ్యశ్రీకి రూ.700 కోట్లు బకాయిల నిధులు విడుదలయ్యాయి. నీరు చెట్టు బకాయిలు రూ.256 కోట్లు చెల్లించింది. వరదల్లో పంట నష్టం రూ.2 వేలనుండి రూ.10 వేలకుపెంచి 4 లక్షలమందికి రూ.601 కోట్లు ఇచ్చింది. రేషన్ బియ్యంతోపాటు తగ్గింపు ధరల్లో పంచదార, కందిపప్పు, వంటనూనె ఇస్తోంది. గత ప్రభుత్వం పెట్టిన గుడ్లు, చిక్కీల బకాయిలు రూ.175 కోట్లు చెల్లించింది. విదేశీ విద్య బకాయిలు రూ.32 కోట్లు విడుదల చేసింది. రోడ్ల మరమ్మతులకు రూ.476 కోట్లు విడుదల చేసింది. నెలనెలా 1వ తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తోంది.
విభజన చట్టం హక్కుల సాధనలో భాగంగా అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ.12,500 కోట్లు సాధించడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25 వేల కోట్ల పెట్టుబడులు, 75 వేలమందికి ఉపాధికి కేంద్రం నుండి ఆమోదం పొందింది. విశాఖ రైల్వే జోన్ భూమిపూజకు చురుగ్గా ఏర్పాటు జరుగుతోంది. విశాఖ స్టీలు ప్రైవేటీకరణ కాకుండా రక్షించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 జిల్లాలతోపాటు అదనంగా ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధించింది. తెలంగాణ నుంచి రూ.2,500 కోట్లు బకాయిలు తెచ్చింది. రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు రెండున్నరేళ్లలో పూర్తి చేయడానికి కేంద్రం అనుమతి పొందింది. రూ.70 వేలకోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వేగంగా అమలుకు అనుమతులు సాధించింది.
15వేల ఉద్యోగాల కల్పనకు హెచ్‌సీఎల్‌ను, 10 వేల ఉద్యోగాల కల్పనకు టీసీఎస్‌ను ఐటీ మంత్రి నారా లోకేష్ సాధించారు. అలాగే నాలుగు నెలల్లోనే 60 వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షించడమైంది. ఇవికాక 70 వేల కోట్లతో బీపీసీఎల్ నిర్మాణం కాబోతోంది. విద్యుత్ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టబుడుల ఆకర్షణ, 7.5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతోంది. గ్రామాల్లో రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టడానికి పంచాయతీరాజ్ శాఖామంత్రి పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారు. 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి అతి పెద్ద గ్రామ పాలనగా ‘‘వరల్డ్ రికార్డు యూనియన్’’ తమ రికార్డుల్లో నమోదు చేసింది. సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్న మామిడిదుర్గ, జుబేద, జుబేర్, వీరేంద్రలను లోకేష్ స్వదేశానికి వచ్చేలా చేశారు. తుంగభద్రలో కొట్టుకపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమను కాపాడిరది చంద్రన్న ప్రభుత్వమే. బుడమేరు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన మూడు పెద్ద ఐరన్ బోట్లను తొలగించడమైంది. కుట్రదారులైన వైసీపీ నాయకుల్ని అరెస్టు చేయడమైంది. ప్రజావేదిక, ప్రజాదర్బార్‌ల ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మరియు ఇతర మంత్రులు 50 వేలకు పైగా ప్రజా ఫిర్యాదులు స్వయంగా తీసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచడమైంది. యువగళం పాదయాత్ర హామీమేరకు బంగారుపాళెంలో డయాలసిస్ యూనిట్‌ను లోకేష్ ప్రారంభించారు. ముచ్చుమర్రి గ్యాంగ్ రేప్ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోబడ్డాయి. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 1489 కొత్త బస్సుల కొనుగోలు, దిపావళికి మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్‌లోపు డిఎస్సీ పూర్తి చేసి 16,437 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమవుతుంది. అక్టోబర్ 16నుండి విషపూరిత మద్యం బ్రాండ్ల స్థానంలో నాణ్యమైన మద్యం షాపుల ప్రారంభం జరుగుతోంది. అక్టోబర్ నెలాఖరులోపు కొత్త ఇసుక రీచ్‌లు ప్రారంభమౌతాయి.
జగన్ మొదటి నాలుగు నెలల పాలనలో…
రూ.250 పింఛన్ ఇవ్వడం తప్ప మరే హామీని జగన్ అమలు చేయలేదు. 5వ నెలలో డ్రైవర్లకు 10 వేలు ఇచ్చాడు తప్ప మరేమీ చేయలేదు. రెండోవైపు అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతిలాంటి 100కు పైగా చంద్రన్న సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లించాడు. ప్రశ్నించిన ఈ వర్గాలవారిని 600 మందిని హత్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టో హామీలు 85 శాతం అమలు చేయలేదు. ధరలు, పన్నులు, చార్జీలు భారీగా పెంచి బాదుడే బాదుడుగా చేశాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలుగా మారి 10 లక్షల కోట్లు దోపిడీ చేశారు. 10 లక్షల ఎకరాలు అసైన్‌మెంట్ భూముల కబ్జాకు కుట్ర పన్నారు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేసే నవ మోసాలే జగన్ పథకాలు.
జగనే వచ్చి ఉంటే…
పింఛన్ రూ.3 వేలే. రూ.4 వేలు వచ్చి ఉండేది కాదు. అన్న క్యాంటీన్లు ఉండేవి కాదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు దివాళా తీసేవి. పెట్టుబడులు వచ్చేవి కాదు. ప్రజల ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. కరెంటు కోతలు, చార్జీల మోతలతో ప్రజలు అల్లాడేవారు. వరదలు, విపత్తుల్లో ప్రజల్ని గాలికి వదిలేసేవారు. రౌడీలు, హంతకులు పెట్రేగిపోయేవారు. విషపూరిత మద్యంతో ఎంతోమంది తాళిబొట్లు తెగి ఉండేవి.
పూటకో అబద్ధం రోజుకో కుట్ర
వినుకొండలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణలో ఒకరు చనిపోయారు. ఈ హత్యను టీడీపీకి అంటగట్టడమేకాక రాష్ట్రంలో 36మంది హత్యకు గురయ్యారని జగన్ ఢల్లీిలో ధర్నా చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేసేందుకు ఇక్కడ శాంతిభద్రతలు లేవని కలరింగ్ ఇచ్చే కుట్ర చేశారు. నీవు చెబుతున్న 36మంది పేర్లు ఇవ్వండి చర్య తీసుకుంటామని సీఎం ప్రకటించినా.. జగన్ ఆ పేర్లు ఈనాటికీ ఇవ్వలేదు. అంటే 36 మంది హత్య కావింపబడ్డారనే జగన్ ఆరోపణ పచ్చి అబద్ధమే అని స్పష్టమైంది. విజయవాడ వరదల్లో 60మంది చనిపోయారని మరో అబద్ధపు ప్రచారం చేశారు. ఆ పేర్లు ఇవ్వమని ప్రభుత్వం కోరితే నేటికీ జగన్ ఇవ్వలేదు. అంటే అది అబద్ధం కావడమే. అలాగే కృష్ణ వరదల్లో అమరావతి మునిగిందని మరో అబద్ధపు ప్రచారం చేశారు. కృష్ణా నదికి వరద చరిత్రలో ఎన్నడూ రానంతగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అయినా అమరావతి మునిగి పోలేదని మీడియా సాక్షిగా స్పష్టమైంది. చంద్రబాబు ఇంటిని రక్షించుకోవడం కోసమే వెలగలేరు లాకులు ఎత్తివేసారని మరో అబద్ధపు ప్రచారం చేశారు. వెలగలేరు లాకులు ఎత్తకపోతే అన్నమయ్య డ్యాంలాగా కొట్టుకుపోయి పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. బుడమేరు వరద విపత్తుకు కారణం దాన్ని వైకాపా నేతలు ఆక్రమించడం, బుడమేరు పనులను జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వల్లే అది జరిగింది. విజయవాడ వరద సహాయం రూ.203 కోట్లు ఇస్తే అందులో రూ.534 కోట్లు అవినీతి జరిగిందని మరో అబద్ధపు ప్రచారం చేశారు. వైకాపా రంగులు ఉన్న మూడు పెద్ద ఐరన్ బోట్లతో ప్రకాశం బ్యారేజీని విధ్వంసం చేసే కుట్ర చేశారు. గతంలో తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 16 భోగీలను నిలువునా తగలబెట్టే కుట్ర చేశారు. బాబాయి వివేకాను హత్య చేయించి నారాసుర రక్త చరిత్ర అంటూ జగన్ మీడియాలో అబద్ధపు రాతలు రాశారు. కోడికత్తి కుట్ర చేసి టీడీపీకి అంటగట్టే కుట్ర చేశారు. ఎన్నికల లబ్ధికి గులకరాయి కుట్ర చేసి ఒక బీసీ బాలుడిని జైలు పాలు చేశారు. ఈ నేరాన్ని టీడీపీకి అంటగట్టి అబద్ధపు ప్రచారం చేశారు. తన అబద్ధాలు, కుట్రలు టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే 100సార్లు చెప్పడం జగన్ ట్రేడ్ మార్క్‌గా ఉంది.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్