- ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యబీమాతో వైద్యసేవలు
- రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం
- రూ.2500 వరకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు
- బీమా, ఆయుష్మాన్, ఎన్టీఆర్ వైద్యసేవల కలయిక
- ఇక నుంచి బిల్లులు, పేదలకు వైద్యసేవలు ఆగవు
- గత ప్రభుత్వంలో ఆసుపత్రుల్లో అనేక అక్రమాలు
- వారు పెట్టిన రూ.1350 కోట్ల బకాయిలు చెల్లించాం
- ఆసుపత్రుల్లో ఇక జవాబుదారీతనం పెంచుతాం
- వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో శుక్ర వారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందని వెల్లడిరచారు. దీనివల్ల 1.43 కోట్ల కుటుం బాల్లోని 4.30 కోట్ల మంది పేదలకు ఉచితంగా రూ.25 లక్షల వరకు వైద్యసాయం అందుతుందని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్యసేవ అనుసంధానమవుతాయని తెలిపారు. ఫలితంగా పేదలకు నాణ్యమైన వేద్యసేవలు అందుతాయని అభయం ఇచ్చారు. హైబ్రిడ్ మోడల్ వల్ల రూ. 2.5 లక్షల లోపల ఉచిత వైద్యసేవలు ఉండవని, పేదలకు అందించే వైద్యసేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. రూ.2.5 లక్షల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుంటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్యసేవలు అందుతాయి కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్యసేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. దీనికోసం బీమా కంపెనీలు, ఆస్పత్రులతో మాట్లాడినట్లు వివరించారు.
ఉత్తమ వైద్య విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం
దేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లోని ఉత్తమ వైద్య విధానాలను పరిశీలించిన తర్వాతే హైబ్రిడ్ మోడ్‌లో వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైబ్రిడ్ మోడ్ వల్ల వైద్యసేవలు ఎక్కువమంది ఉపయోగించుకుంటున్నారని, ఎక్కువ క్లెయిమ్స్ ఉంటున్నాయని డబ్ల్యూహెచ్‌వో కూడా ఆరు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడిర చిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా హైబ్రిడ్ మోడ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. వైద్యసేవల్లో 90 శాతం క్లెయిమ్స్ రూ.2.5 లక్షల లోపే ఉంటున్నాయని చెప్పి న మంత్రి…రూ.2.5 లక్షల వరకు బీమా సంస్థలు, ఆపై రూ.25 లక్షల వరకు ట్రస్ట్ భరించేలా నిర్ణయించామన్నారు. ఆరోగ్య బీమా పథకం వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు వివరించారు. 1.43 కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి కూటమి ప్రభుత్వం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న ట్లు తెలిపారు. ఇప్పటివరకు వైద్యసేవలు అందించిన తర్వాత ఆసుపత్రులకు బిల్లులు చెల్లించే వాళ్లని, ముందుగానే బీమా ప్రీమియం చెల్లించడం వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు పెండిరగ్లో ఉంటాయన్న భయం కూడా ఉండదన్నారు. ప్రస్తుతం ప్రీ-ఆథరైజేష న్ కోసం 24 గంటలు పడుతోందని, దీనిని 6 గంటలకు కుదించేలా బీమా కంపెనీలతో మాట్లాడినట్లు వెల్లడిరచారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్యానెల్ డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి క్లెయిమ్‌లకు త్వరగా అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా క్లెయిమ్‌ను తిరస్కరిస్తే అప్పీల్‌కు వెళ్లడానికి కూడా అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. చెల్లించిన ప్రీమియం మొత్తం కన్నా క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉంటే మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేలా నిబంధనలు పెడుతున్నట్లు వెల్లడిరచారు.
ఆసుపత్రుల్లో జవాబుదారీతనం పెంచుతాం
గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల్లో అనేక రకాల మోసాలు జరిగాయన్న మంత్రి ఈసారి ఆ అవకాశం ఇవ్వకుండా కృత్రిమ మేథ సాయంతో ఆసుపత్రుల్లో జవాబుదారీ తనం పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన ఆసుపత్రులకు ఐదేళ్లలో రూ.16 కోట్ల పెనాల్టీలు వేసి కనీసం ఒక శాతం రికవరీ కూడా చేయలేదన్నా రు. ప్రస్తుతం రూ.22.70 కోట్ల జరిమానాలు విధించి నోటీసులు జారీ చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వైద్యసేవల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18, 500 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తమకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటాయింపులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాటలు కోటలు దాటాయి కానీ, చేతలు గడప కూడా దాటలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శ్రీ కోసం ఐదేళ్లలో ఖర్చు చేసిన మొత్తం రూ.9942 కోట్లు మాత్రమేనని కాగా సగటున సంవత్సరానికి రూ.1,988 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. పైగా ఆరోగ్య శ్రీ కింద రూ.2,225 కోట్ల బకాయిలను వారసత్వంగా వదిలివెళ్లారని…ఆ బకాయిల్లో కూటమి ప్రభుత్వం రూ.1350 కోట్లు చెల్లించినట్లు తెలి పారు.
గత ప్రభుత్వ హయాంలో 38 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ కింద లబ్ధిపొందా యని, సగటున ఏడాదికి 7.60 కుటుంబాలు లబ్ధిపొందాయన్న మంత్రి కూటమి హయాంలో జూన్ 6 నుంచి డిసెంబర్ 31 వరకు కేవలం ఆరునెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 7.61 లక్షల కుటుంబాలు లబ్ధిపొందినట్లు చెప్పారు. హైబ్రిడ్ విధానంలోనూ 3,257 రకాల వైద్యచికిత్సలు పేదలకు అందుతాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలైన బోధనాసుపత్రులు అసంపూర్తిగా ఉండటం వల్లే తరగ తుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని మంత్రి చెప్పారు. చైనాలో కొత్త రకం వైరస్ విజృంభిస్తోందన్న వార్తలపై స్పందిస్తూ అలాంటిది ఏమైనా దేశంలోకి అడుగుపెడితే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో మంజుల పాల్గొన్నారు