కడప: ఒక తప్పును ఎక్కువ కాలం కప్పిఉంచలేరని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు.కడప జిల్లా బద్వేలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పును కప్పిపుచ్చాలని చూస్తే, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లకి ఆ ప్రభావం తగులుతుందని వివేకా హత్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవుడు పదవి ఇచ్చింది న్యాయం చేయడానికి మాత్రమే అని, తప్పులు కప్పిపుచ్చడానికి కాదని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయంలో అయినా, దైనందిన జీవితంలో అయినా అన్యాయం అన్యాయమే. అన్యాయం చేసినవాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాంలే అనుకున్నా దేవుడి వద్ద మేనేజ్ చేసుకోలేరన్నారు. దేవుడు న్యాయం వైపే ఉంటాడన్నారు. వివేకా చాలా మండి మనిషి అని, ఆయన హత్య బాధాకరమన్నారు.