- అర్జీల పరిష్కారం, ఫాలోఅప్ విధానంపై ఆరా
కుప్పం(చైతన్యరథం): నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జననాయకుడు పోర్టల్ పనివిధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శిం చిన ఆయన అక్కడే జననాయకుడు పోర్టల్ నిర్వహిస్తున్న సిబ్బంది తో సమావేశమయ్యారు. అర్జీలు పరిష్కరించే నిమిత్తం చేపడు తున్న ఫాలో అప్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. పోర్టల్కు ఇప్పటివరకు వచ్చిన అర్జీలను పరిశీలించారు. ఏయే అంశాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని అడిగి తెలుసు కున్నారు. అర్జీల పరిష్కారం విషయంలో స్థానిక నేతల సహకారం తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు.
















