- పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున ప్రణాళికలు
- జాబ్ ఫస్ట్ విధానంతో కొత్త పాలసీలు
- ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ శాఖల మంత్రి కె.శ్రీనివాస్
- చంద్రబాబు అంటేనే బ్రాండ్: మంత్రి సవిత
పెనుగొండ(చైతన్యరథం): ‘ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమం కింద ఉత్పత్తుల శ్రేణిని విస్తరించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ అనుబంధ ముడిసరుకు వనరులను ఉపయోగించుకోవాలని ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ శాఖల మంత్రి కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ అంశాలపై సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలతో సమీక్షించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, ఏపీ ఐసీసీ పుట్టపర్తి జోన్ జిల్లా అధికారి సోనీ సహాని, అనంతపురం జిల్లా జిఎం శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి కల్పనలో రాష్ట్రంలోని సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమలు మంచి ఫలితాలు సాధిస్తు న్నాయని తెలిపారు. పెట్టుబడి ట్రాకర్, సింగిల్ డెస్క్, పీఎంఈజీపీ, ఏపీ ఎగుమతుల పోర్టల్‌తో సహా పరిశ్రమల కోసం వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున ప్రణాళిక అమలు చేస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవా లని సూచించారు.
టెక్నాలజీ వినియోగంతో సంపద సృష్టి
టెక్నాలజీని ఉపయోగించుకుని పనిచేయగలిగితే మన ఉత్పాదకత పెరుగుతుందని, సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. వీటిని సాకారం చేసేందుకు విజన్ డాక్యుమెంట్ తో పాటు 20 కొత్త పాలసీలు తీసుకొచ్చామని వివరించారు. జాబ్ ఫస్ట్ విధానంతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, ప్రైవేటు పార్కు పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీలను తీసుకొచ్చా మని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీక రణ జరగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతు న్నామని తెలిపారు. వీటి వల్ల 5 లక్షల మందికి ఉపాధి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రం ఎనర్జీ హబ్‌గా తయారవుతుందని, ఇందులో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు రావాలని, 7 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పిం చాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందు చూపుతో ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అపా రమైన చేనేత కార్మికులు ఉన్నారని, వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, పరిశ్రమల స్థాపనకు ముందు వచ్చే వారికి ప్రభుత్వం ప్రోత్సా హకాలు, వివిధ రకాల బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, విరివిగా రుణాలు అందజేయడానికి కృషి చేయడానికి ఎస్ఎల్బీసీలో పలు అంశాలను రాష్ట్ర స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు, స్వయం సహాయ క మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి విస్తృతంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో పరిశ్రమల స్థాపనకు మహిళలు ముందు కు వస్తే వారిని ప్రోత్సహించి అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
చంద్రబాబు అంటేనే బ్రాండ్
బీసీ సంక్షేమ మంత్రి సవిత మాట్లాడుతూ జగన్ పాలన అంతా అప్పులమ యం..చంద్రబాబు అంటేనే బ్రాండ్ అన్నారు. ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని కేవలం 5 నెలల కాలంలోనే చంద్రబాబు చేసి చూపించారని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్రానికి తరలివస్తున్న వేల కోట్ల పెట్టుబడులే నిదర్శమని తెలిపారు. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు ఆలోచనతో కియా పరిశ్రమ తీసుకొచ్చి ప్రపంచ పటంలో పెనుగొండ ప్రాంతాన్ని చూపెట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విజన్ 2047 ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి ధ్వేయంగా మరికొన్ని పరిశ్రమలు రప్పించడానికి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపా ర వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఆర్డీవో ఆనంద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఎల్డీఎం రమణ కుమార్, డిక్కీ ప్రతినిధి వెంకటరమణ, వివిధ బ్యాంక్ అధికారులు, ఉమ్మడి జిల్లాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆయా అధికారులు తదితరులు పాల్గొన్నారు.