లక్నో: తన ఆప్తమిత్రుడు, యుపి మాజీ ముఖ్య మంత్రి ములాయం సింగ్ యాదవ్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తరప్రదేశ్లోని సఫయ్లో జరిగిన ములాయం అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు హాజర య్యారు. అంతకుముందు ములా యంసింగ్ యాదవ్ పార్థివదేహం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి అశ్రునయ నాలతో నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్,ఇతర కుటుంబసభ్యులను చంద్ర బాబు పరామర్శించారు.ఎంపిలు గల్లా జయదేవ్, కన కమేడల రవీంద్రకుమార్,మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు చంద్రబాబు వెంట యుపి వెళ్లారు.