చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఫలితాల సాధనే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు

ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Dec 14, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఫలితాల సాధనే లక్ష్యంగా..పాఠశాల విద్యలో సంస్కరణలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కలసికట్టుగా ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేద్దాం
  • అంతిమంగా ఆంధ్రామోడల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ లక్ష్యం
  • మౌలిక వసతులు హార్డ్‌ వేర్‌… ఉపాధ్యాయులు సాఫ్ట్‌వేర్‌
  • ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలుచేయాలని నిర్ణయించామని, ఇప్పుడు అమలు చేయలేకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. జీఓ 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో లోకేష్‌ శుక్రవారం ఉండవల్లి నివాసంలో 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక గత ఆరునెలలుగా లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌పై దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్య ఉన్నతాధికారులు ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై నిరంతరం చర్చలు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మా వద్ద పరదాలు ఉండవు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు. సంస్కరణల అమలులో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడం.

అపార్‌ ఐడి నమోదు 70శాతం పూర్తయ్యాక కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. డ్రాపవుట్స్‌ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సంస్కరణలు అమలుచేయడం అనివార్యం. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఫలితాల విషయంలో ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడాలి. ఇందులో భాగంగా ఇటీవల మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం)ను విజయవంతంగా నిర్వహించాం. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నదే మా ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్‌ సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు బాలల్లో నైతిక విలువలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

ప్రభుత్వ విద్య బలోపేతానికి సహకరించండి
సంస్కరణల అమలులో భాగంగా ప్రతి స్కూలుకు మౌలిక వసతులు, విద్యా సంబంధిత ఫలితాలపై స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నాం. 20మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 30శాతం ఉన్నాయి. 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు మీ వంతు సహకారం అవసరం. దీనిపై జిల్లా కలెక్టర్లకు కూడా ర్యాంకింగ్‌ ఇచ్చాం. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నచోట ఫలితాల్లో వెనుకబడి ఉండటం, సరైన వసతులు లేని చోట ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనించాం. రెండిరటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతోపాటు స్పోర్ట్స్‌, డిజిటల్‌ లైబ్రరీ, ల్యాబ్స్‌ వంటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. సర్కారు విద్యలో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుదాం. నేను యువగళం పాదయాత్ర చేసే సమయంలోనే జీఓ 117తో ఏర్పడిన విపరిణామాలు నా దృష్టికి వచ్చాయి. చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి పాఠశాలలకు రావడం కష్టం. అందుకోసం ఆ జీఓను రద్దుచేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాం. ఉపాధ్యాయులపై అనవసరమైన యాప్‌ల భారం తగ్గించాం. ఇంకా అమలులో ఉన్న నాన్‌ అకడమికమ్‌ యాప్‌ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తాం. మౌలిక సదుపాయాలు హార్డ్‌ వేర్‌ అయితే టీచర్లు సాఫ్ట్‌వేర్‌ లాంటి వారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్ర మోడల్‌ ఎడ్యుకేషన్‌ మా లక్ష్యం. ఉపాధ్యాయుల సహకారంతోనే అది సాధ్యమని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, అశోక్‌ బాబు, వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.

ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలి
పాఠశాల విద్యశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ…మంత్రి లోకేష్‌ బాధ్యతలు చేపట్టాక తమతో ఒక్క ప్రభుత్వ స్కూలు మూతపడకూడదు, ఒక్క టీచర్‌ కూడా తగ్గకూడదని స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. ఇది మంత్రి లోకేష్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. ఫలితాల సాధన, హాజరు శాతం పెంపుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలి. గతంలో ప్రతి హెడ్‌మాస్టర్‌ తమ పరిధిలోని గ్రామంలో బడిఈడుకు వచ్చిన పిల్లల సమాచారంతో సెన్సస్‌ రిజిస్టర్‌ నిర్వహించేవారు. మళ్లీ ఆ విధానాన్ని తీసుకువస్తే తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడానికి ఆస్కారమేర్పడుతుందన్నారు.
పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు మాట్లాడుతూ… మంత్రి లోకేష్‌ ఆదేశాలతో సమస్యలపై గత ఆరునెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. బదిలీలు, ప్రమోషన్లు ఎలా ఉండాలనే అంశంపై సంఘాల అభిప్రాయం తీసుకున్నాం. వారి సూచనలతో బదిలీల కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించాం. పూర్తి పారదర్శకంగా ఏప్రిల్‌, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేస్తాం. ప్రతిక్లాసుకు ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక మోడల్‌ స్కూలు ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మెరుగైన ఫలితాల కోసం వందరోజుల పాఠ్యప్రణాళికను పకడ్బందీగా అమలుచేయాలని కోరారు.
స్కావెంజర్స్‌ జీతాల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సూచనను పరిశీలిస్తామని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.
పదోన్నతులకు అవకాశం కల్పించండి
సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ… 20ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన సెకండరీ టీచర్‌ కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌, హెచ్‌ఎం పదోన్నతితోనే ఆగిపోతున్నారు.. లెక్చరర్లు, డివైఇఓ వంటి ప్రమోషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డివైఈఓ పోస్టుల భర్తీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల తొలి తప్పిదానికే తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో పట్టువిడుపుతో వ్యవహరించాలని కోరారు. 100 రోజుల ప్రణాళికలో ఆదివారాలను మినహాయించాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గిపోవడానికి గత ప్రభుత్వం 117 జీఓ తేవడం ప్రధాన కారణమని తెలిపారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఏర్పాటుచేసే మోడల్‌ స్కూలుకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం అమలు చేయాలని, యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ట్రాన్స్‌ఫర్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. స్పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు రూరల్‌ స్కూళ్లకు పీఈటీలను నియమించాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలను సావధానంగా ఆలకించిన మంత్రి లోకేష్‌ వీటిని కేటగిరైజేషన్‌ చేసి పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎల్‌ సాయిశ్రీనివాస్‌, ఎం రఘునాథరెడ్డి (ఎస్టియు ఎపి), ఎజిఎస్‌ గణపతిరావు, ఎ.ప్రకాశరావు (ఆప్టా), ఎం.కృష్ణయ్య, ఎఎం గిరిప్రసాద్‌ (పిఆర్‌టియు), ఎం.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ (యుటిఎఫ్‌), పివి రమణ, వి.శ్రీనివాసరావు (ఎపిహెచ్‌ఎంఎ), జి.హృదయరాజు, ఎస్‌ చిరంజీవి (ఎపిటిఎఫ్‌ 1938), సిహెచ్‌ మంజుల, కె.భానుమూర్తి (ఎపిటిఎఫ్‌), ఎస్‌ బాలాజీ, జివి సత్యనారాయణ (ఎపియుఎస్‌), పి.అశోక్‌ కుమార్‌, జి.సుధీర్‌ (వైఎస్‌ఆర్‌ టిఎ), తదితరులు పాల్గొన్నారు.

Previous Post

రాష్ట్రం దిశ దశ మార్చేందుకే..స్వర్ణాంధ్ర- 2047

Next Post

వైసీపీ నేతల వేధింపులకు కుమారుడి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
ఆంధ్రప్రదేశ్

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం
ఆంధ్రప్రదేశ్

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ May 3, 2026
జలధారతో భూగర్భజలాలు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్

జలధారతో భూగర్భజలాలు పెరిగాయి

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist