అమరావతి : అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతి ష్టాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయి. మన రాష్ట్రంతోపాటు ఇతరరాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువు కుంటున్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండ కూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవ డం, మరమ్మతులు చేయకపోవడం దారుణం. ఆయా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించం డి. మీ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు.. కానీ అవి సామాన్యులను సైతం ఇలా ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇటువంటి ఆలోచనలురాష్ట్రానికి శ్రేయ స్కరం కాదని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.