కల్తీ నెయ్యి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ…హిందువుల మనోభావాలను దెబ్బతీసి వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహావేశాలకు గురై ఛీకొట్టించుకున్న జగన్‌రెడ్డి చేసిన పాపా లను కప్పిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. ఆయన గత పాలనలో చేసిన పాపాలు జనం మరిచిపోలేదు. సంక్రాంతి సంబరాలకు ఆయన ఇంటి దగ్గర టీటీడీ గుడి సెట్ వేసుకున్న విషయం ఇప్పటికీ గుర్తుంది..వేంకటేశ్వరస్వామిపై ఏ మాత్రం భక్తి ఉందో ఆ ఘటనే చెబుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రధాని మోదీకి దమ్ముంటే ఆయన లేఖ రాయగలరా? ఒకరిని అన్నిసార్లూ మోసం చేయచ్చేమో..కానీ అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేమని గుర్తుపెట్టుకో.
నీ పాపాలు పండే రోజు వచ్చింది. మేము వదిలిన కలియుగ దైవం వెంకన్న స్వామి నిన్ను వదలడు. మేము నిరాధార ఆరోపణలు చేయం.. వ్యక్తిగత విమర్శలూ చేయం. కానీ తప్పుచేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టం. ప్రతిఒక్కరికీ న్యాయం చేసి ప్రజా రంజకంగా పాలన అందించడానికి కంకణబద్ధులమై ఉన్నాం. అదే చెప్పి ప్రజల వద్దకు వెళ్లాం. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తిరుగులేని అధికారం కట్టబెట్టి మిమ్మల్ని మూలన కూర్చోపెట్టారు. ప్రజల ఆశలు నెరవేర్చడమే మా ఆశయం. ఇవాళ తిరుమలలో మీ హయాంలో మీరు చేసిన అపవిత్రపు అకృత్యాలు బయటకు వస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా కూటమిపై విమర్శలు చేస్తున్నారు. మీ కాసుల కక్కుర్తితో తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చారు. దేశవిదేశాలలో ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన మీకు పుట్టగతులు ఉంటాయా?
వైసీపీ హయాంలో తిరుమల లడ్డుల నాణ్యతా లోపం మీద కేంద్ర సంస్థ ల్యాబ్ రిపోర్ట్ మీ ముందు పెట్టాము. అయినా టీడీపీ హయాంలో ఇచ్చిన కంపెనీకే మేము టెండర్ ఇచ్చా మని వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో ఎల్ 3గా నిలిచింది. అయినా కూడా ఎల్ 1, ఎల్ 2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20 శాతం సరఫరా చేసింది. ప్రీమియర్ ఎల్ 1గా, ఎల్ 2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కిలో నెయ్యి రూ.424 ప్రకారం టీటీడీకి సరఫరా చేసేలా వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. చాలాకాలం నుంచి మేము టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యలేదని నందిని చైర్మనే స్వయంగా చెప్పారు. దేశంలో పేరుగాంచిన నందిని ఆగ్రో ఎప్పటినుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. తక్కువ ధరకు అడుగుతున్నారు.. నాణ్యత విషయంలో మేము రాజీపడలేమని కనీసం తమను టెండర్లలో కూడా పాల్గొన నివ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని వారే స్పష్టం చేశారు. 2020 డిసెంబరు నుంచి లడ్డు నాణ్యత బాగోలేదు. ఇంతకు మునుపులాగా రుచి లేదు. అదో రకమైన వాసన వస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్‌దాస్ స్వయంగా లడ్డు నాణ్యత మీద ప్రశ్నించారు. ప్రీమియం సంస్థ టీడీపీ హయాంలోనే ఉంటే ఎంతకు టెండర్ వేశారో సమాధానం చెప్పండి? 2019 తరువాత తక్కువ నాణ్యతతో సరఫరా చేస్తుంటే మీరు ఎందుకు ఊరుకున్నారు?
కరోనా తరువాత అన్ని నిత్యావసర రేట్లు అమాంతం మూడిరతలు పెరిగాయి. కానీ నెయ్యి రేటు మాత్రం 2018-2021 మధ్యన రేట్లు పెరగకపోగా తగ్గింది. దీని వెనుక ఉన్న మతలబు ఏంటి? దేశంలో ఎక్కడైనా రూ.320కి ఆవు నెయ్యి దొరుకుతోందా? మీ తాడేపల్లి పాలెస్‌లో ఏమేనా స్వయంగా తయారు చేస్తున్నారా? ‘‘రివర్స్’’ అంటూ నాణ్యతా ప్రమాణా లు పాటించని కంపెనీల కాసులకు కక్కుర్తిపడి భక్తుల మనోభావాలతో ఆడుకున్నావు. మీ పాలనలో లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం బాగా లేదని భక్తులు ఆరోపించటం, సోషల్ మీడియాలో అన్న ప్రసాదం ఎలా ఉందో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తిరుమల ప్రక్షాళన దిశగా చేపట్టిన చర్యలతో భక్తుల తాకిడి పెరిగింది. పింక్ డైమండ్ అన్నావు..నిరూపించలేకపోయావు. జగన్మోహన్‌రెడ్డికి అసలు హిందూ మతం మీద గౌరవం లేదు… గుడిలోకి చెప్పులు వేసుకువెళ్లిన హీన చరిత్ర అతనిది. తిరుమల మొత్తం రేట్లు పెంచేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం లేకుండా చేశారు.
రావి రాధాకృష్ణమూర్తి, గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు