- నాది విజన్.. జగన్ ది పాయిజన్
- 72 రోజుల తర్వాత అమరావతే రాజధాని
- దేవతల రాజధానిని ఇలాంటి సైకోలు ఏమీ చెయ్యలేరు
- జగన్ లాంటి మారీచుడ్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం
- అభివృద్ధి టీడీపీ మార్క్, విధ్వంసం జగన్ మార్క్
- కేజీఎఫ్‌ను మరిపించేలా కిలాడి రోశయ్య గ్రావెల్ తవ్వకాలు
- కక్షతోనే సంగం డెయిరీపై సర్కారు దాడి
- పొన్నూరు రా… కదలిరా సభలో చంద్రన్న
- 98 శాతం హామీలు అమలు చేశానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వీడియో ప్రదర్శన
పొన్నూరు: జగన్ అనే సైకో ఊరికో సైకోను తయారు చేశాడు. వారంతా ప్రజలను నాన ఇబ్బందుల పాల్జేస్తున్నారు. టీడీపీ`జనసేన ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వటం తథ్యం. వీరందరినీ అణచివేయడం తధ్యమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి లో జరిగిన రా.. కదలి రా బహిరంగ సభలో చంద్ర బాబు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడటమే తనముందున్న ప్రధమ కర్తవ్యం అని పేర్కొన్నారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారం లోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుం ది.. ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన జగన్ రాజ ధానిని నాశనం చేశాడు.. అమరావతికి తప్పకుండా మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తనది విజన్ అయితే.. జగన్ ది పాయిజన్ అని, రాష్ట్రానికి పరిశ్రమ లు తీసుకొచ్చి ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల్ని మాయ చేయడానికి జగన్ మారీచుడిలా రకరకాల వేషాలేస్తున్నాడని మండిపడ్డా రు. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి హామీలిచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చా డు. ఇప్పుడు మరోసారి సిద్ధం అంటూ కథలు చెబుతు న్నాడు. ఇలాంటి మారీచుల్ని తరిమికొట్టేందుకు ప్రజ లంతా సిద్ధం కావాలి. యువత ఎటువైపు ఉంటే విజ యం వారిదే. పొన్నూరులో ఏడు సార్లు టీడీపీని గెలి పించి కంచుకోటగా నిలిపారు. అలాంటి పొన్నూరు పొగరు చూపించాల్సిన సమయ మొచ్చింది.
నయవంచన జగన్ మార్క్..
జగన్ కొత్త డ్రామా ప్రారంభించాడు.ఇదీ నా మార్క్ అంటూ వెర్రి కథలు చెబుతున్నాడు. ఏది జగన్‌రెడ్డీ నీ మార్క్? నయవంచన, విధ్వంసమా? టీడీపీ హయాం లో రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.1000 చేయడం నీ మార్కా? క్వార్టర్ రూ.60 ఉన్న మద్యం రూ.200 అమ్మి ప్రజల ఇళ్లూ, ఒళ్లూ గుల్ల చేయడం నీ మార్కా? పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపడం నీ మార్కా.నిరుద్యోగంలో 24శాతంతో దేశం లోనే ఏపీని అగ్రస్థానంలో నిలపడం నీ మార్కా. ఉచి తంగా అందే ఇసుకను కేజీల లెక్క అమ్ము కోవడం నీ మార్కా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయడం, బీసీ బిడ్డని పెట్రోల్ పోసి తగులబెట్టడం నీ మార్కా? పరదాలు కట్టుకు తిరగడం, వెళ్లిన ప్రతి చోటా పచ్చని చెట్లు నరికించడం జగన్ మార్క్. రివర్స్ పేరుతో రాజధాని, పోలవరం నాశనం.. గంజాయి సరఫరాలో ఏపీని దేశానికి కేపిటల్ చేయడం… ఇదీ జగన్ నీ మార్క్ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇదీ నా మార్క్..
ప్రతి గ్రామంలో కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5కి.మీలకు ఒక హైస్కూల్ ఇది నా మార్క్. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నా మార్క్. నాలెడ్జ్ ఎకానమీ, 11 డీఎస్సీలతో 1.50 లక్షల టీచర్ ఉద్యో గాల భర్తీ నా మార్క్. పేద పిల్లలకు విదేశీ విద్య, డ్వాక్రాసంఘాల ఏర్పాటు,పొదుపులో దేశానికి ఆదర్శం గా మార్చడం, ఆడబిడ్డలకు నాయకత్వం ఇవ్వడం నా మార్క్. దీపం పథకంతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లి వ్వడం నా మార్క్. దేశ ప్రగతిని మార్చే పాలసీలు, రోడ్ల నిర్మాణం, సంపద సృష్టి నా మార్క్. బీసీలకు, మహిళ లకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నామార్క్. దళిత బిడ్డ లు బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేయడం నామార్క్. అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడం నా మార్క్. సైబరాబాద్ నిర్మాణం తో రైతు బిడ్డలు లక్షలు సంపాదించేలా చేయ డం నామార్క్. కియాకంపెనీ నామార్క్. అశోక్ లే ల్యాండ్ నా మార్క్. పోలవరం పరుగులు నా మార్క్. పట్టిసీమ వెలుగులు నామార్క్. 25వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, గ్రామ గ్రామాన ఎల్‌ఈడీ లైట్లు నా మార్క్. పేదలకు రూ.5కే అన్నంపెట్టే అన్నక్యాంటీన్లు పెట్టాను.. ఇదీ జగన్‌రెడ్డీ నామార్క్ అని చంద్రబాబు అన్నారు.
ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలు ఏకమవ్వాలి..
జగన్ పార్టీ ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలంతా ఏకమవ్వాలి. బాదుడే బాదుడు రెక్కను ఉత్త రాంధ్ర వాళ్లు విరగ్గొట్టాలి. విధ్వంసాల రెక్కను రాయల సీమ వాసులు విరగ్గొట్టాలి. హింసా రాజకీయాలను కోస్తా వాసులు విరగ్గొట్టాలి. రెక్కల్లేని ఫ్యాన్‌ను తాడేపల్లి లో కూర్చోబెట్టాలి. జగన్ పాలనలో ఏ బిడ్డకైనా ఉద్యోగాలొచ్చాయా?
యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. జాబు రావాలంటే తిరిగి బాబు రావాల్సిందేని యువత చెప్తోంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా..వారి భవిష్యత్ బాగుండాలన్నా టీడీపీ రావాలి. పల్లెల్లో ఉండే వారు కూడా ప్రపంచంతో అనుసంధానమై పని చేసు కునే పరిస్థితి భవిష్యత్తులో చూస్తామని చంద్రబాబు అన్నారు.
ఉద్యోగులకిచ్చిన హామీలపై చేతులెత్తేశాడు..
రాష్ట్ర విభజనతో అప్పులు తప్ప ఆదాయం లేదు. అయినా తెలంగాణ కంటే ఒకశాతం ఎక్కువగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాను. డీఏ, పెన్షన్ అన్నీ ఇచ్చా ను. వారంలో సీపీఎస్ రద్దు అంటూ హామీ ఇచ్చిన జగన్ చేతులెత్తేశాడు. సీపీఎస్ ఎలాగో లేదు.. కనీసం నెలవారీ జీతాలిస్తే చాలు అనే స్థితికి ఉద్యోగుల్ని తీసు కొచ్చాడు. ఒకప్పుడు జీతాలు పెరగాలని పోరాటాలు చేసిన వారు ఇప్పుడు సకాలంలో జీతాలొస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు.ఈ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టింది. కాంట్రాక్టర్లకు రూ.95 వేల కోట్ల బకాయిలున్నాయి. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు. పోలీసులతో ఉపా ధ్యాయులపై కేసులు పెట్టించారు. పోలీసులు కూడా తప్పుని సమర్థించొద్దు. తప్పుచేసిన వారు ఎవరైనా ఒకే లా వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించే వారికి ఇబ్బందులు తప్పవు. దేశంలో తొలిసారిగా స్థానిక సంస్థల్లో మహిళలకు 8శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్. మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీ తోనే. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. చదువుకోని మహిళల్లో కూడా సమర్థత ఉందని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మి డ్వాక్రా తెచ్చా. ఆ వ్యవస్థ ఎంత బలంగా తయా రైందో ఇప్పుడు గ్రామ గ్రామానా చూస్తున్నాం. జగన్ రెడ్డి ఎన్నో వ్యవస్థల్న నాశనం చేసినా.. డ్వాక్రాను మాత్రం కదపలేకపోయాడు. మహిళల కోసం ప్రత్యే కంగా కాలేజీలు పెట్టా. ఉద్యోగాలొచ్చి ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళాభ్యున్నతి ద్వారా మాత్రమే పేదరిక నిర్మూల సాకారమవుతుంది. జగన్‌రెడ్డి రూ.10 ఇచ్చి రూ.1000 దోచేస్తున్నాడు. నిత్యావసరాలు, పన్నులు, ఛార్జీల్లో దోచుకుంటున్నాడు. నేను రూ.10 ఇచ్చి దాన్ని రెట్టింపు చేసుకునేందుకు మార్గాలు చూపిస్తా. నేను చేస్తున్న ఈ యజ్ఞానికి ఆడ బిడ్డలే సారథులు.
ఇదేనా నీ విశ్వసనీయత?
విశ్వసనీయత అంటూ జగన్ డైలాగులు చెబుతు న్నాడు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, వారంలో సీపీ ఎస్ రద్దు, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, బీసీ సబ్‌ప్లాన్, బీసీలకు 139కార్పొరేషన్లు, పంట వేసే ముందే మద్దతు ధర, గిట్టుబాటు ధర,అమరావతి రాజధాని,కాపు కార్పొ రేషన్ నిధులు, కరెంటు ఛార్జీలు, 2024 నాటికి మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అని చెప్పావు.. ఒక్కటైనా అమలుచేశావా? పోలవరంపై మాట మార్చా వు. వివేకా హత్యకేసులో నిందితులను వెనకేసుకొస్తు న్నావు.ఏది నీ విశ్వసనీయత? జగన్‌రెడ్డి మీబిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు.. 75పైసలు కూడా ఖర్చు చేయలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులకు చెందిన నిధులు బొక్కేసి మీ బిడ్డ అంటున్నాడు. 99శాతం హామీలు అమలు చేసేశానని చెప్పే అబద్ధాలతో జగన్‌కు ఆస్కా ర్, నోబెల్ ఇచ్చినా తక్కువే. మరోవైపు సిద్ధం అంటూ సభలు పెడుతున్నాడు. మేము కూడా సిద్ధమే..జగన్ రెడ్డిని గద్దె దించడానికి. మొన్నటి వరకు నాకు అడ్డం లేదు..నా వెంట్రుక పీకలేరు అన్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా దిగిపోతా అంటూ బీద అరుపులు అరుస్తు న్నాడు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణపై ఆంబోతు రాంబాబు దాడి చేయించాడు. విశాఖలో మీటింగ్ పెట్టి మా కటౌట్లు పెట్టి వాటిని వైసీపీ కార్యకర్తలతో కొట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇప్పడు ఇక్కడ జగన్ ఫోటో పెట్టి కొట్టలేమా..మాకు చేతకాదా..కానీ మన సంస్కృతి అది కాదు. మాచర్లలో దుర్గారావు అనే మత్స్యకారుడు పార్టీ మారనందుకు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.గతంలోనూ తోటచంద్రయ్య వైసీపీ కి జై కొట్టమంటే కొట్టనందుకు పీక కోసి చంపారు. ఈ సైకో, పిల్ల సైకోల వేధింపులతో బలై పోయిన వారంతా తిరుగుబాటు చేయడం తధ్యం. అనంతపురంలో ఒక మహిళ పెన్షన్ అడిగితే.. నటరాజ్ అనే వైసీపీ నాయ కుడు పక్కలోకి రమ్మన్నాడు. తిరగ బడినందుకు రోడ్డు పైనే ఆమెను కొట్టినా పోలీసులు స్పందించలేదు. ఈ ఆంబోతుల నుండి రాష్ట్రాన్ని కాపా డుకుందాం.
పెన్షన్ ఎక్కడైనా తీసుకునే సదుపాయం కల్పిస్తా జగన్‌రెడ్డి పెన్షన్ పెంచుతూ…పోతా అంటూ దగా చేశా డు. ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలంటూ నిబంధనలు పెట్టాడు. కానీ నేను హామీ ఇస్తున్నా.. మూడు నెలలవరకు ఎప్పుడైనా,ఎక్కడైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు తీసు కొస్తా. ప్రతి పెన్షన్ దారుడికీ అండగా ఉంటా. అమరా వతి రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలి. ప్రతి గడప లోనూ రా కదలి రా అనే నినాదం వినిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మూడు ముక్కలాటతో అమరావతి నాశనం..
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో నేను ముందడుగేశా. రాష్ట్రంలోని ప్రతిఒక్కరి ఆత్మ విశ్వాసం పెంచడం ద్వారా సంపద సృష్టించా. సైబరా బాద్ నిర్మించడంతో దేశంలోనే మొదటి పది అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. అదే స్థాయిలో అమరావతి నిర్మాణానికి శీకారం చుట్టాను.కానీ జగన్‌రెడ్డి సర్వనాశనం చేశాడు. ప్రపం చంలో ఎక్కడా, ఎప్పుడూ, ఎవరూ చేయని సాహసం అమరావతి రైతులు చేశారు. 35వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు.అలాంటి అమరావతిపై కులం ముద్ర వేశాడు, మూడు ముక్కలాట ఆడుతూ రాజధా నిని నాశనం చేశాడు. నేను శాశ్వతం కాదు.. జగన్ శాశ్వతం కాదు.. రాష్ట్రం శాశ్వతం. లక్షల మందికి ఉపాధినిచ్చే అమరావ తిని నాశనంచేశాడు. అమరా వతిలో అసెంబ్లీ, సెక్రటేరి యేట్, హైకోర్టు అన్నీ కట్టాం. విట్, ఎస్.ఆర్.ఎం, అమృత్ లాంటి యూని వర్శిటీలు అమరావతికి తీసుకొచ్చా. దేశంలో టాప్ వర్శిటీలు, స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు ఇక్కడకు రావాలని కలలుకన్నా.
ఇది దేవతల రాజధాని. ఇలాంటి సైకోలు ఎంత మంది వచ్చినా అమ రావతి ని ఏమీ చేయలేదు. మనం కట్టిన టిడ్కో ఇళ్లకు రంగు లేసుకున్నాడే తప్ప..పేదలకు అందించలేదు. జగన్ వచ్చాక దొంగలంతా కలిసి రోడ్లలోని గ్రావెల్ కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు.
కేజీఎఫ్‌ని మరిపించిన కిలాడీ!
టీడీపీ గేట్లు తెరిస్తే.. జగన్‌రెడ్డి పార్టీ ఖాళీ అవ డం తధ్యం. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. కిలాడి రోశయ్యగా, గ్రావెల్ రోశయ్యగా మారాడు. పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ తయారు చేశాడు. కేజీఎఫ్‌ని మరిపించేలా కిలాడీ రోశయ్య తవ్వేశాడు. 700 ఎకరాల్లో రూ.2వేల కోట్ల విలువైన మట్టి అమ్మేశా డు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రజలకోసం విక్రమార్కు డిలా పోరాడాడు. సంగం డైరీ గుంటూరు పాడి రైతుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అలాంటి సంగంపై దాడి చేశారు. నరేంద్రను జైల్లో పెట్టారు. ఈ రోజు మనం ఎదుర్కొన్న ప్రతి ఘటనకూ రేపు చక్రవడ్డీతో సహా చెల్లించడం తధ్యం. జగన్‌రెడ్డి అరా చకానికి రాష్ట్రంలో అందరూ బాధితులే. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మనపై ఎన్నో కేసులేశాడు. అమరా వతి, రింగ్ రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశాడు. ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న అలాంటివాడిని కూడా జగన్ ఒక తన్నుతన్నాడు. గుంటూరు తూర్పు ఎమ్మె ల్యే ముస్తఫా.. గంజాయి, గుట్కా, డ్రగ్స్ సహా చేయ ని చీకటి వ్యాపారంలేదు. పనిమనిషి కొడుకు టీడీపీ నేతలతో తిరిగాడని తల్లిపై తప్పుడు కేసు పెట్టాడు. ఇలాంటి తప్పుడు చర్యలను అల్లా చూస్తూ ఊరుకో డని గుర్తుంచుకో జగన్‌రెడ్డీ అని హెచ్చరించారు. మన దగ్గర నుండి వెళ్లిన ఒక ఎమ్మెల్యే అక్కడ చిత్తు కాగితంలా తయారయ్యాడు. ఆ నియోజకవర్గానికి చిలకలూరిపేట నుండి చెత్తను తెచ్చి వేశాడు. వారి కథ తెలిసే లోగా ఎన్నికలు అయిపోవాలని జగన్ కలలు కంటున్నాడు. ప్రత్తిపాడుకు చెందిన హోం మంత్రి.. దిశ చట్టం ఉందని చెప్పేది. ఎక్కడ అంటే సమాధానం లేదు. పదవులిప్పి స్తామని సొంత పార్టీ వారి దగ్గర డబ్బులు లాక్కోవడం తప్ప చేసిందేమీ లేదు. తెనాలి ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ఇంట్లో పనిమనుషులుగా వాడేస్తాడు. కంకర నుండి ఇసుక వరకు ఏదీ వదలడు.చేనేత కార్మికులు, రైతులు,బీసీ లు ఎక్కువగా ఉండే మంగళగిరిని అభివృద్ధిలో ఏపీ లో నెం.వన్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.