అక్కుపక్షిలా శవాలకోసం ఎదురుచూస్తూ.. శవరాజకీయాలు చేయడం.. కాలకేయుల్లాంటి కామాంధులను రాష్ట్ర నలుమూలల పెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడం తప్ప.. గత ఐదేళ్లు జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. చెమ్మచెక్కలాడే చెడ్డీగ్యాంగ్‌కు ఒక్కఛాన్స్ అంటే జనం అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. రాకాసుల్లా రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై పడి దోచుకోవడమే కాకుండా.. చివరకు దేవాలయాలు.. ఆ కలియుగ దైవమైన వెంకన్న సన్నిధిలో కూడా చేయరాని పాపాలు చేశారు. కమీషన్‌ల కోసం కక్కుర్తి పడి.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారు. ఆవు నెయ్యి పేరుతో గొడ్డుమాంసం, చేప మాంసం, పందిమాంసం నుండి వచ్చే కొవ్వుతో కల్తీ అయిన నెయ్యి కొనుగోలు చేసి శ్రీవారి లడ్డూ తయారీలో వాడారు. ఇంతకంటే ఘోరం మరోకటి ఉంటుందా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామివారి ప్రసాదం ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏ విధంగా ఉందో భక్తులను అడిగితే చెబుతారు?
వైసీపీ హయాంలో వాడిన నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు, తదితర పదార్థాలు అన్నీ నాసిరకమే. వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూల్లో నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎన్నోసార్లు ఈ అంశంపై నిలదీసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వామి వారిపై భక్తితో రాయితీ మీద తక్కువ రేటుకు సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) కో ఆపరేటివ్ డెయిరీ తయారు చేసే నందినీ బ్రాండ్ ఆవునెయ్యిని కాదని..కమీషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కనపెట్టి.. కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి నచ్చిన ట్రేడర్లకు టెండర్‌ను అప్పజెప్పారు. స్వచ్ఛమైన కేజీ ఆవు నెయ్యి రూ. 400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కానీ రూ.320కే సరఫరా చేస్తానంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంత తక్కువ ధరకు ఇవ్వటం ఎలా సాధ్యం అని కనీసం విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని రూ .320కే సరఫరా చేశాయనేది వాస్తవం.
నాసిరకం నెయ్యి అని నిర్ధారించిన ల్యాబ్
నేతి నాణ్యతను పరిశీలించేందుకు తేది 08.07.2024న NDDB CALF( నేషనల్ డైరీ డవలప్ మెంట్ బోర్డు) ల్యాబ్ కు పంపించగా.. అక్కడ నేతి శ్యాంపిల్స్ ను పరిశీలించి 16.07.2024న నివేదిక ఇచ్చారు. NDDB CALF ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలిస్తుంది. ISO 17025 గుర్తింపు పొందింది. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో అపార అనుభవం ఉంది. ప్రభుత్వంతోపాటు అనేక సంస్థలు ఈ ల్యాబ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ సంస్థ నివేదికలను ఆధారంగా చేసుకుని అనేక ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ పంపించిన నేతిని పరిశీలించగా… సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది. వీటితోపాటు బీఫ్ టాలో (గొడ్డు కొవ్వు), పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారని తేలింది. సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకన్నకు నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందించే లడ్డూ తయారీలో ఈ కల్తీ నెయ్యినే వాడి, మహా ప్రసాదాన్ని వైసీపీ నేతలు అపవిత్రం చేశారంటే ఇంతకన్నా ఘోరం ఉండదు. వారిని దేవుడు అసలు వదిలిపెట్టడు. అందుకే వైసీపీ నేతలు 11 సీట్లకు పడిపోయి పాతాళంలో పడ్డారు. అయినా సిగ్గు లేకుండా.. చేసిందంతా చేసి చిత్రాంగి ముఖంతో మీడియా ముందుకు వచ్చి జగన్ రెడ్డి కట్టుకథలు చెప్పి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నించడం సిగ్గుచేటు.
సరఫరాదారులు పంపించే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా శ్రీవారి లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని చీణణదీ ల్యాబ్ కు పంపితే అందులో ఇతర పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. నాణ్యతను పెంచేందుకు ఫీు ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఈ ఎక్స్‌పర్ట్ కమిటీలో… ఎన్ డిఆర్ ఐ, బెంగుళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, డెయిరీ ఎక్స్‌పర్ట్ డా.డి.సురేంద్రనాధ్, హైదరాబాద్‌కు చెందిన డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, ఐఐయం బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ బి.మాధవన్, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాస్వర్ణలత లు ఉన్నారు.
కమిటీ సిఫారసులు
లడ్డూలో వాడే ఆవు నెయ్యి 120 సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసినదై ఉండాలి. సైంటిఫిక్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించి 7 నుంచి 9 పాయింట్ల మధ్య నమోదైతేనే పరిగణనలోకి తీసుకోవాలి. తిరుమలకు 800 కి.మీ. దూరంలో ఉన్న డెయిరీల నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలి. ఆబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్‌ను ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన కంపెనీలే టెండర్‌కు అర్హత పొందాలి. ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడ నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి? ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి? క్వాలిటీ రిపోర్టులు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. టెండర్లలో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకు కోట్ చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ కూడా తీసుకోవాలి. ఈ ఏడాది జూన్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసి పాపాలను ప్రక్షాళన చేసేందుకు పై సిఫారసులను పరిగణనలోకి తీసుకుని నెయ్యి కొనుగోలుకు కొత్త టెండర్లు పిలిచింది.