- చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని ప్రతి నాయకుడు పనిచేయాలి
- టీడీపీ ట్రైనింగ్ రిసోర్స్పర్సన్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్
మంగళగిరి (చైతన్యరథం): ఎంత సీనియర్ నేతలైనా టీడీపీ లైన్‌కు కట్టుబడి పనిచేయాల్సిందేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణా తరగతుల ట్రైనర్లతో లోకేష్ మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,300మంది క్లస్టర్, బూత్ ఇన్చార్జిలకు శిక్షణా తరగతులు పూర్తిచేశామని, 50 వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులకు శిక్షణ తరగతులు నిరంతరం కొనసాగుతాయని, సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్లు అన్న పార్టీ మూల సిద్ధాంతానికి అను
గుణంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 45 రోజుల్లో 1.13కోట్ల ఇళ్లను నాయకులు సందర్శించా రని చెప్పారు. పార్టీకంటే ఎవరూ గొప్పవారు కాదని, ఏదైనా అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలో కేవలం పెర్ఫార్మెన్స్ ఆధారంగానే
నాయకులకు గుర్తింపునిస్తామని, ఈ విషయంలో ఎటువంటి సిఫారసులు, పైరవీలకు తావీయబోమని స్పష్టం చేశారు.
పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా, సులభంగా గ్రాస్ రూట్ స్థాయి కేడర్‌కు తీసుకెళ్లేందుకు ఏఐని వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణ తరగతులకు వచ్చే నాయకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందరూ ఆర్థికంగా బలోపేతమై సొంత కాళ్లపై నిలబడేలా చేయాలన్నదే పార్టీ అధినేత చంద్రబాబు అంతరంగమని లోకేష్ తెలిపారు.
కేంద్రంలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ కేడర్ కమిట్ మెంట్ ప్రధాన కారణమని లోకేష్ అన్నారు. రాష్ట్రం లో కూడా ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అందరికీ ఒకేసారి న్యాయం చేయడం సాధ్యం కాదని, వివిధ కారణాల వల్ల తొలి దశలో అవకాశాలు రానివారికి మలి విడతలో అవకాశం కల్పిస్తామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచీ సేవలందిస్తున్న పలువురు సీనియర్ నాయకుల అనుభవాలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మానవవనరుల విభాగం కో-ఆర్డినేటర్ వేపాడ చిరంజీవి, ఎంపీ చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న పార్టీ సీనియర్ నాయకులకు మంత్రి లోకేష్ ప్రశంసాపత్రాలు అందజేశారు.
















