చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యువగళం హామీలన్నీ నెరవేరుస్తా

విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Jan 28, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
యువగళం హామీలన్నీ నెరవేరుస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా
  • 7 నెలల పాలనలో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు
  • స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు
  • జగన్‌పై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు
  • చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదు
  • 5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు!
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం
  • సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో ఆలస్యమైనా నిజం గెలుస్తుంది!
  • విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నం (చైతన్యరథం): యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సోమవారం జరిగిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడిరది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షిలో నాపై అసత్య కథనాలతో వార్త ప్రచురించారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో చిరుతిళ్లకు రూ.25లక్షలు ఖర్చుపెట్టారని దుష్ప్రచారం చేశారు. దానిపై నేను లీగల్‌ నోటీసులు ఇచ్చాను. ఆధారాలు లేకుండా వార్త ప్రచురించారని, నా పరువుకు భంగం కలిగిందని, క్షమాపణలు చెప్పాలని, పత్రికలో వివరణ ఇవ్వాలని నేను డిమాండ్‌ చేశాను. ఇదే విధమైన కథనం ప్రచురించిన ద వీక్‌ పత్రిక క్షమాపణ చెబుతూ రీజాయిండర్‌ కూడా ఇచ్చింది. సాక్షి పత్రిక మాత్రం పదేపదే అబద్ధాలు చెబుతూ దానిని నిజం చేయాలని చూస్తోంది. అందుకే ఐదేళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నాను. ఎన్నిసార్లయినా నేను కోర్టుకు వస్తా. మంత్రి హోదాలో వచ్చినా.. నేను పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించి, నా సొంత డబ్బునే ఖర్చుచేస్తున్నాను. ఒక్క వాటర్‌ బాటిల్‌ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి నేర్పించారు. ఈ కేసును లాజికల్‌ ఎండ్‌కు తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదా వేసినా వస్తాను. ఎందుకంటే నేను తప్పుచేయలేదు. ఆలస్యమైనా నిజం గెలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నానని మంత్రి లోకేష్‌ అన్నారు.
ప్రతి హామీ నిలబెట్టుకుంటా
నేను ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేశా. ప్రైవేటు రంగంలో ఉంటూ ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి వస్తాననే ఉద్దేశంతో స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసేందుకు మొగ్గుచూపాను. తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ ఎంబీఏ కేవలం వ్యాపార రంగానికి మాత్రమే మంచిదనే విషయం నాకు అర్థమయింది. రాజకీయాల్లో ఎంబీఏ అంటే పాదయాత్ర. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశా. పాదయాత్రలో ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారితో మేమేకమవుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రజాసమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలనేది నా కోరిక. అందుకే ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని మంత్రి లోకేష్‌ వివరించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
జగన్‌ రెడ్డిపై తల్లి, చెల్లికే నమ్మకం లేదు. ఇక పార్టీలో ఉన్న నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తారు. అది నిజం అవుతోంది. వైసీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదు. దర్యాప్తు జరుగుతోంది. జరగనివ్వండి, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని భావిస్తున్నా. కాకినాడ పోర్టును అడ్డగోలుగా, బెదిరించి లాక్కున్నారు. రూపాయికి ఆరుపైసలే ఇచ్చి విజయసాయిరెడ్డి కొట్టేశారు. దీనిపై కేసు నమోదయింది. ఈడీ కూడా విచారిస్తోంది. విశాఖలో భూకబ్జాలపైనా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ అక్రమాలపై ఒకేసారి దర్యాప్తు చేస్తే లా అండ్‌ ఆర్డర్‌ కు ఇక పోలీసులు ఉండరు. గత ఐదేళ్ల పాలనలో గాలి కూడా అమ్మేశారు. విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇది కక్షసాధింపు కాదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.
7 నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు
గతంలో అమర్‌నాథ్‌ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దావోస్‌ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చారో చెప్పాలి? ఎన్డీయే ప్రభుత్వం 7 నెలల్లో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చింది. వీటిద్వారా 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారు. దావోస్‌ లో ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరు. చర్చిస్తాం. వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటాం. ఆర్సెల్లెర్‌ మిట్టల్‌తో మేం ఒప్పందం చేసుకోలేదు. ఎంవోయూ ఎందుకు.. డైరెక్ట్‌గా వర్క్‌ లోకి వెళ్దామని వారు చెప్పారు. దీనికి మమ్మల్ని తప్పుబడతారా? వారిని అన్ని అనుమతులు ఇచ్చాం. భూమి కేటాయింపులు చేస్తాం. 6,7 నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తాం. ఇవన్నీ వైసీపీ హయాంలోనే వస్తే ఎందుకు శంకుస్థాపనలు చేయలేదు? వైఎస్‌ వల్లే కియా మోటార్స్‌ వచ్చిందని గతంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. టీసీఎస్‌ సంస్థ వస్తున్న క్రెడిట్‌ తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. తాను వెళ్లి స్వయంగా మాట్లాడి ఒప్పించి టీసీఎస్‌ను విశాఖకు తీసుకువస్తున్నానని మంత్రి లోకేష్‌ తెలిపారు.
స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు వస్తాయి
మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్ల వారికి పెట్టుబడులు వస్తున్నాయి. స్థిరమైన ప్రభుత్వం వల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. గతంలో దావోస్‌లో జగన్‌ రెడ్డిని కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త ప్రయత్నిస్తే కలవబోమని చెప్పారని, టీడీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడమే అందుకు కారణమని సదరు వ్యక్తి చెప్పారు. అది ప్రపంచంలోనే పేరొందిన కంపెనీ. కనీసం వారి సమస్యలు పరిష్కరించేందుకు కూడా జగన్‌ రెడ్డి కానీ, పరిశ్రమల మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఐటీ కంపెనీలతో సమావేశం పెట్టాను. ప్రజలు కూడా ఆలోచించాలి. గుజరాత్‌ లో ఐదుసార్లుగా ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల, మహారాష్ట్రలో కూడా అదే ప్రభుత్వం రావడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు స్పీడ్‌గా వెళ్లాం. తర్వాత బ్రేక్‌ పడిరది. మా హయాంలో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేశారు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులని గేమ్‌ ఆడారు. దీనివల్ల ఏపీ ప్రజలు నష్టపోయారు. ప్రజలందరూ దీనిని గమనించాలి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, నేను అందరం.. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం గెలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం. జగన్‌ రెడ్డి మళ్లీ రాడని గ్యారంటీ ఏముందని పెట్టుబడిదారులు అడుగుతున్నారు. అమర్‌ రాజా బ్యాటరీని ఎంతగా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. ఏపీలోనే హయ్యస్ట్‌ టాక్స్‌ పేయర్‌ అమర్‌ రాజా కంపెనీ. అలాంటి కంపెనీని జగన్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి వేధించారు. అమర్‌ రాజా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిని కూడా ఇబ్బందిపెట్టారు. జగన్‌ ఉంటే ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు వస్తారని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు.
ఆర్కే రోజాకు దావోస్‌కు, జ్యూరిచ్‌ కు తేడా తెలియదు
ఒక్కో పారిశ్రామికవేత్తను ఒప్పించడానికి కష్టపడాల్సి వస్తోంది. కాగ్నిజెంట్‌ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశాను. మన పిల్లల కోసం వెళ్లాను. త్వరలోనే విశాఖ, ఉత్తరాంధ్రకు కాగ్నిజెంట్‌ నుంచి మంచి వార్త వస్తుంది. ఆర్కే రోజాకు దావోస్‌కు, జ్యూరిచ్‌ కు తేడా తెలియదు. జ్యూరిచ్‌ లో తెలుగువారితో సమావేశమయినప్పుడు ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెడ్‌బుక్‌ గురించి మాట్లాడాను. దావోస్‌లో మాట్లాడలేదు. అయినా రెడ్‌ బుక్‌ గురించి వారికి ఎందుకంత భయమని మంత్రి లోకేష్‌ నిలదీశారు.
టీసీఎస్‌ 90 రోజుల్లో వస్తుంది
విశాఖలో టీసీఎస్‌ సంస్థకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించాము. రాయితీలు కూడా త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే భూములు కూడా కేటాయిస్తాం. సమస్యలు ఏమైనా వాట్సాప్‌ ద్వారా పరిష్కరిస్తాం. 90 రోజుల్లో టీసీఎస్‌ వస్తుంది. తాత్కాలికంగా అద్దే భవనాల్లో ప్రారంభిస్తారు. భవనాలు కట్టేందుకు 2,3 ఏళ్లు పడుతుంది. 5 ఏళ్లలో విశాఖలో 5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. 2014 నుంచి 19 వరకు ఎందుకోగానీ ఒక రెసిస్టెన్సీ ఉంది. ఇప్పుడు చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఐటీ రంగంలో ఇప్పుడు నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డీప్‌ టెక్నాలజీ, బిగ్‌ డేటా, ఏఐ వచ్చాయి. వీటిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాం. ఇందులో భాగంగానే డేటా సిటీ గురించి చర్చించాం. ఇన్ఫోసిస్‌ వాళ్లు క్యాంపస్‌ వెతుకుతున్నారు. విప్రో వాళ్లు విస్తరణకు చూస్తున్నారు. టాప్‌ 100 కంపెనీలతో మేం మాట్లాడుతున్నాం. జీసీసీ(గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌) ఏర్పాటుకు కూడా కృషిచేస్తున్నాం. మొదటి 500 కంపెనీలకు దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకు భూములు ఇస్తామని దావోస్‌లో హామీ ఇచ్చాను. గతంలో హెచ్‌సీఎల్‌ కు కూడా ఇదే విధంగా ఇచ్చాం. ఇప్పుడు విస్తరణ దిశగా వెళ్తున్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా స్టార్టప్‌ లకు సహకారం అందిస్తాం. పాయకరావుపేట-తుని ఎయిర్‌ పోర్ట్‌పై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో మాట్లాడాల్సి ఉందని మంత్రి లోకేష్‌ తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం. ఎన్డీయే ప్రభుత్వం, ప్రజల దయవల్ల మేం మాట్లాడగలుగుతున్నాం. దేశంలో అనేక ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరణ జరుగుతుంటే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. ప్రజలిచ్చిన తీర్పు వల్లే ఇది సాధ్యమైంది. 7 నెలల్లో ప్లాంట్‌ స్టెబిలిటీ కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కేంద్రం నుంచి రూ.11వేల కోట్ల నిధులు తీసుకువచ్చాం. ఏపీ నుంచి రూ.2,500 కోట్లు ఇస్తున్నాం. గతంలో వాజ్‌ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇదంతా ఈక్విటీ రూపంలో వస్తోంది. కష్టపడి దేశానికి తిరిగి చెల్లిద్దామని కోరుతున్నాం. కేప్టివ్‌ మైన్స్‌ అర్థంలేని వాదన. కేప్టివ్‌ మైన్స్‌ లేకుండానే ఎమ్‌ఎన్‌డీసీతో టై అప్‌ అయి ఆర్సెల్లెర్‌ మిట్టల్‌ పెట్టుబడులు పెడుతోంది కదా. కొంతమంది సీఈవోల వల్ల ఇబ్బందులు వచ్చాయి. పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కును సెట్‌ చేస్తాం. లాభాల్లోకి తీసుకువస్తాం. నేను హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీల్‌నే వాడా. ఇప్పుడు అమరావతిలో కూడా విశాఖ స్టీల్‌నే వినియోగిస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు
ప్రజల కోసం 3 నెలల్లో రుషికొండ భవనాలను ఓపెన్‌ చేస్తాం. విద్యాదీవెన విషయంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్టుగా కాలేజీల యాజమాన్యాలకే నిధులు చెల్లిస్తాం. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. లింకింగ్‌ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే నిధులు విడుదల చేస్తాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టింది. తాము చెల్లిస్తున్నామని మంత్రి లోకేష్‌ చెప్పారు.
పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా
నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే చూడండి. చంద్రబాబు ఏ బాధ్యతలు ఇచ్చినా అహర్నిశలు కష్టపడి పనిచేస్తా. పార్టీని బలోపేతం చేస్తా. పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. పాదయాత్ర చేశాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఒక పదవిలో ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా ఈ సారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నా. గ్రామపార్టీ నుంచి పొలిట్‌బ్యూరో వరకు పార్టీలో మార్పులు రావాలని, దీనిపై పెద్దలు నిర్ణయిస్తారని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

Previous Post

యువగళం పాదయాత్ర..అరుదైన జ్ఞాపకం

Next Post

కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist