- ఎటువంటి అవకతవకలకు తావివ్వొద్దు
- రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చూడాలి
- సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించేది లేదు
- దరఖాస్తుల కోసం వచ్చే వారికి సహకరించాలి
- 16వ తేదీ నాటికి కొత్త షాపులు అమల్లోకి రావాలి
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం
- మద్యం పాలసీపై శాఖ అధికారులతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేయా లని, ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా చూడాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. బుధవారం ఆయన ఎక్సైజ్ శాఖ అధికా రులతో జూమ్‌లో సమీక్షించారు. దరఖాస్తుల ప్రక్రియ గురించి చర్చించారు. మద్యం సిండికేట్లు తయారయ్యాయంటూ వచ్చిన కథనాలపై అధికారుల నుంచి వివరణ కోరారు. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెదిరిస్తున్నారనే వార్తలను ఖండిరచారు. ఎక్సైజ్ అధికారులు ఎవరైనా సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. దరఖాస్తుల దాఖలు నుంచి షాపుల కేటాయింపు వరకు పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. లక్ష దరఖాస్తులు లక్ష్యంగా నిర్దేశించుకోగా 56 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మరో రెండురోజుల్లో లక్ష్యాన్ని సాధించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చివరి రెండురోజులు ఎక్కువ దరఖాస్తు లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశిం చారు. కొన్ని జిల్లాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి దరఖాస్తులు రావడం పట్ల సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో ప్రతిఒక్క జిల్లాలో దరఖాస్తుల దాఖలుపై అవగాహన కల్పించాలని సూచించారు.